Siddheshwar
-
కల్యాణ వైభోగమే..
అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు ‘హర హర మహాదేవ.. శంభో శంకర’.. ‘ఓం నమఃశివాయ’ అంటూ శివనామస్మరణతో ఆలయూలు మారుమోగారుు..శనివారం శివపార్వతుల కల్యాణం కన్నులపండువగా జరిగింది..భక్తులు వేల సంఖ్యలోతిలకించారు.. - హన్మకొండ చౌరస్తా/ కాశిబుగ్గ హన్మకొండ పద్మాక్షికాలనీలోని స్వయంభూ సిద్ధేశ్వరాలయంలో శనివారం ఉదయం 11.45 గంటలకు శివపార్వతుల కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య మూడు గంటలపాటు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. ‘హర హర మహాదేవ శంభో శంకర్’.. ‘ఓం నమఃశివాయ’ అంటూ భక్తుల శివనామస్మరణతో సిద్ధేశ్వరాలయం మార్మోగింది. శివపార్వతులను పట్టువస్త్రాలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేశారు. కల్యాణ మండపాన్ని పూలతో అలంకరించారు. శివపార్వతుల వివాహ వేడుకలు చూస్తున్నంత సేపు భక్తులు తన్మత్వయంతో పులకరించారు. మహాశివరాత్రి వేడుకల ఆరంభంలో భాగంగా.. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 9 గంటలకు నవగ్రహ మండప ఆరాధన, ఉత్సవ విగ్రహమూర్తులకు పంచామృతాలు, నవరసాలు, అభిషేకాలు నిర్వహించారు. వివాహానంతరం మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివాహ వేడుకలను సుమారు మూడు వేలకుపైగా భక్తులు తిలకించారు. కాశీవిశ్వేశ్వరాలయంలో.. కాశిబుగ్గలోని పవిత్ర కాశీ విశ్వేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి శివ కల్యాణం వైభవంగా జరిగింది. సుమారు 500 మంది జంటలు ఈ శివ కళ్యాణంలో పాల్గొన్నారుు. ఆలయ అర్చకులు రవీంద్రనాథ్‌శర్మ, రజనీకాంత్కుమార్, ఓంప్రకాష్, రాజేష్ అత్యంత వైభవంగా స్థాని క భక్తుల సమక్షంలో కల్యాణాన్ని నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ వరకు రకరకాల కార్యక్రమాలు ఉంటాయని, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు కోరారు. శివరాత్రి పూజల్లో పాల్గొనండి హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో మ హాశివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని జ రుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రధానార్చకులు ఉపేం ద్రశర్మ తెలిపారు. 16వ తేదీ సోమవారం జరగను న్న చండీహోమంలో పాల్గొన దల్చినవారు రూ. 2,116, 19వతేదీ గురువారం అన్నపూజలో పాల్గొనదల్చినవారు రూ. 15,116 చెల్లించి రశీదు పొందాలని తమగోత్రనామాదులు నమోదు చేయించుకోవాలి. వీరికి స్వామివారి ప్రసాదములు, శేషవస్త్రాలు అంద జేయబడతారుు. దీంతోపాటు లింగోద్భవకాల పూజలో పాల్గొనేవారు రూ.11,116, అన్నపూజలో పాల్గొనే వారు రూ.3,116, శివకళ్యాణంలో పాల్గొనే వారు రూ.1,116 చెల్లించి రశీదు తీసుకోవాలన్నారు. -
గెలవలేకనే ప్రధాని కొత్త ఇల్లు వెదుక్కుంటున్నారు
కాంగ్రెస్‌కు 75 నుంచి 80 సీట్లకు మించి రావు ప్రధాని పదవిపై రాహుల్, సోనియా ఆశలు వదిలేసుకున్నారు శక్తివంతమైన భారత్ కోసం మోడీకి మద్దతివ్వండి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప దావణగెరె, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదనే భావనతోనే ప్రధాని మన్మోహన్ కొత్త ఇల్లు వెదుక్కునే పనిలో ఉన్నారని, ఇక ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ ప్రధాని పదవిపై ఆశ వదులుకున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. దేశభవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి పట్టం కట్టి శక్తివంతమైన భారత్ ఆవిష్కరణకు ఓటర్లు సహకరించాలని కోరారు. దావణగెరె తాలూకా, ఆనగోడు గ్రామంలో బీజేపీ అభ్యర్థి జీఎం సిద్దేశ్వర్ తరఫున బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సూర్యచంద్రులున్న మాట ఎంత వాస్తవమో ఈ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని కావడం కూడా అంతే సత్యమని జోష్యం పలికారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి 75-80 కి మించి స్థానాల్లో గెలవలేదని అన్ని రకాల సర్వేలు చెబుతున్నాయన్నారు. మోడీ ప్రధాని అవుతారనే భావనతో యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉందన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్లుగా 2020 నాటికి భారతదేశం శక్తిమంతమైన దే శంగా ఎదగాలన్న కల నిజం కావాలంటే నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎస్ఏ రవీంద్రనాథ్, ప్రతిపక్ష ముఖ్య సచేతకులు డాక్టర్ ఏహెచ్ శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యే బసవరాజ్ నాయక్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అణబేరు జీవనమూర్తి, ప్రొఫెసర్ ఎన్.లింగణ్ణ, జెడ్పీ సభ్యులు సహనా రవి, శారదా ఉమేష్ నాయక్, బీఎం సతీష్ తదితరులతో పా టు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీతోనే పేదల సంక్షేమం సింధనూరు టౌన్: బీజేపీతోనే పేదల సంక్షేమం సాధ్యమని మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప పేర్కొన్నారు. తాలూకాలోని మాడసిరివార గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. యూపీఏ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి పట్టం కట్టేందుకు కొప్పళ బీజేపీ అభ్యర్థి కరడి సంగణ్ణకు ఓట్లు వేసి గెలిపించాలని మనవి చేశారు. తాలూకా పంచాయతీ మాజీ సభ్యుడు హంసరాజ్, బీజేపీ వెనుకబడిన వర్గాల జిల్లా అధ్యక్షుడు ఎం.దొడ్డబసవరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రంగనగౌడ గొరేబాళ, ఇంగళి శరణేగౌడ గొరేబాళ, ఫకీరప్ప హెడగినాళ, భీమప్ప, కరియప్ప హరేటనూరు, సిద్దప్ప మాడశిరివార తదితరులు పాల్గొన్నారు.