తెలంగాణ బంద్ తో భక్తుల ఇక్కట్లు | passengers problems of telangana bundh | Sakshi
Sakshi News home page

తెలంగాణ బంద్ తో భక్తుల ఇక్కట్లు

Published Fri, Jul 17 2015 7:52 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

తెలంగాణ బంద్ తో భక్తుల ఇక్కట్లు - Sakshi

తెలంగాణ బంద్ తో భక్తుల ఇక్కట్లు

హన్మకొండ (వరంగల్): మున్సిపల్ కార్మికుల సమ్మెతో గోదావరి పుష్కరాలకు వెళ్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ జిల్లాలోని హన్మకొండ బస్‌స్టేషన్ నుంచి బస్సులను బయటకు రానీయకుండా కార్మికులు గేటు ఎదుట బైఠాయించడంతో.. పుష్కరాలకు వెళ్తున్న భక్తులు నానా అవస్థలు పడుతున్నారు.

మహబూబ్‌నగర్: మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్ధతుగా వామపక్షాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో వామపక్ష కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట డిపో వద్దకు చేరుకొని బస్సులను నిలిపి వేశారు. నాలుగు గంటల పాటు డిపో ఎదుట కార్యకర్తలు బైఠాయించడంతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పుష్కరాలకు వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement