హన్మకొండలో ఘోరం : 9 నెలల పసికందుపై.. | 9 Months Old Baby Murdered in Hanmakonda | Sakshi
Sakshi News home page

హన్మకొండలో ఘోరం : 9 నెలల పసికందుపై..

Published Wed, Jun 19 2019 11:08 AM | Last Updated on Wed, Jun 19 2019 1:26 PM

9 Months Old Baby Murdered in Hanmakonda - Sakshi

తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసిన దారుణ ఘటన హన్మకొండలో చోటుచేసుకుంది.

సాక్షి, హన్మకొండ : తొమ్మిది నెలల పసికందుపై అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేసిన దారుణ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టైలర్ స్ట్రీట్‌ పాలజెండాలో చోటుచేసుకుంది. జక్కోజీ జగన్, రచన దంపతులకు వివాహమైన మూడేళ్ల తరువాత పాప శ్రిత(9నెలలు) జన్మించిది. తల్లితండ్రులు మంగళవారం రాత్రి రెండో అంతస్తులో డాబాపై నిద్రిస్తున్న క్రమంలో కొలేపాక ప్రవీణ్ (28)అనే వ్యక్తి పాపను ఎత్తుకెళ్లి అత్యంత పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడి చిన్నారిని హత్య చేసినట్టు తెలుస్తోంది.

బుధవారం తెల్లవారు జామున స్పృహ తప్పిపడిపోయిన పాపను హూటాహుటిన హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పాప మృతదేహాని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు కారకుడైన ప్రవీణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంజీఎంమార్చురీ వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలని పాప కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement