పూల దుకాణంలో చెలరేగుతున్న మంటలు
సాక్షి, వరంగల్ అర్బన్: జిల్లాలోని హన్మకొండ చౌరస్తాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చౌరస్తాలోని ఓ పూలదుకాణంలో మంటలు అంటుకొని దాదాపు ఆరు పూలదుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని.. పూల దుకాణాలకు పక్కనున్న ఏటీయం సెంటర్, వ్యాపార సముదాయలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపు మంటలపై నీటిని పోస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దగ్ధమైన దుకాణాల విలువ, మంటలు చెలరేగడానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment