వద్దన్న హన్మకొండను ఎట్లిస్తరు?
జనగామ జిల్లా చేయాలని ఉద్యమిస్తుంటే కాదన్న సర్కారు.. వద్దన్న హన్మకొండను ప్రకటించడం విస్మయానికి గురిచేసిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
జనగామ : జనగామ జిల్లా చేయాలని ఉద్యమిస్తుంటే కాదన్న సర్కారు.. వద్దన్న హన్మకొండను ప్రకటించడం విస్మయానికి గురిచేసిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పట్టణంలోని జూబ్లీగార్డెన్‌లో ఆదివారం టీపీటీఎఫ్ అధ్యక్షుడు డి.శ్రీని వాస్ అధ్యక్షతన జరిగిన ‘జనగామ జిల్లా ఏర్పాటు – చారిత్రక ఆవశ్యకత’పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదన లేకుండా చివరి నిమిషంలో హన్మకొండను తెరపైకి తేవడం ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వడంలేదని స్పష్టం చేస్తోందన్నారు. పాలకుర్తి సోమన్న, బమ్మెర పోతన్న, సర్వాయి పాపన్న, చుక్క సత్తెయ్య మూలంగా సాయుధ పోరాటానికి ముందు నుంచే జనగామ ప్రాంత అస్థిత్వం కొనసాగిందన్నారు. జనగామ ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ఎవరికీ అభ్యంతరం లేదని, మరో ప్రాంతంలో కలిపేస్తామంటేనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. జిల్లాల పునర్విభజనకు మెుదట ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత కలెక్టర్ల నివేదికల ఆధారంగా తుదినిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. కేవలం జనాభా లెక్కలు, భౌగోళిక స్థితి గతుల ఆధారంగా జిల్లాల పునర్విభజన చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నా రు. చేర్యాల, మద్దూరు మండలాలను గజ్వేల్ రెవెన్యూ డివిజన్‌లో కలిపితే పరిపాలనా సౌలభ్యం ఎలా అవుతుందో పాలకులే చెప్పాలన్నారు. జనగామ జిల్లా కావాలని ప్రజల్లో బలమైన నినాదం కొనసాగుతుందని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని సూచిం చారు. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, జేఏసీ చైర్మన్ ఆరు ట్ల దశమంతరెడ్డి, డాక్టర్ లక్ష్మినారాయణ, ఓయూ బాలలక్ష్మి, దాసరి కళావతి, పోకల లిం గయ్య, ఆకుల వేణుగోపాల్‌రావు ఉన్నారు.