![నాలాపై ఇరుక్కుపోయిన కారు...](/styles/webp/s3/article_images/2017/09/3/71458874137_625x300.jpg.webp?itok=kL249mHp)
నాలాపై ఇరుక్కుపోయిన కారు...
హన్మకొండ: అదుపు తప్పిన కారు..నాలా పైకి దూసుకెళ్లి ఇరుక్కుపోయింది. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు పక్కనే గల నాలాలోకి దూసుకెళ్లిన కారు.. నాలా అంచుల మధ్య ఇరుక్కుంది. అదృష్టవశాత్తూ.. కారు నాలాలోకి పడిపోకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులోకి జారుకోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.