Edge
-
మోటరోలా ఎడ్జ్ 40 లాంచ్‌కు రెడీ.. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు భలే ఉన్నాయే!
Motorola Edge 40: ఈ ఏడాది తమ మొదటి ఫ్లాగ్షిప్ ఫోన్ మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40)ని మోటరోలా కంపెనీ మే 23న భారత్‌లో లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తాజాగా వెల్లడించింది. ఇదీ చదవండి: అదిరిపోయే రంగులో శాంసంగ్ గెలాక్సీ ఎస్23.. ధర ఎంతంటే.. లాంచ్‌కు ముందే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, డిజైన్‌ను వెల్లడిస్తూ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తన అధికారిక పేజీని కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచింది. ఇందులో ఫాక్స్ లెదర్ లాంటి కవర్‌తో ఉన్న గ్రీన్ వేరియంట్ దర్శనమిస్తోంది. అలాగే బ్లాక్, బ్లూ కలర్ వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ గత సంవత్సరం మార్కెట్లోకి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 30 ప్రో, ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్లకు కాస్త అటూఇటుగా ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు సెల్ఫీ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్‌తో 6.5 అంగుళాల కర్వ్డ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్, HDR10+ సపోర్ట్‌తో POLED ప్యానెల్ మీడియాటెక్ (MediaTek) డైమెన్సిటీ 8020 SoC 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టేరేజ్ 50 ఎంపీ రియర్ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా 4,440mAh బ్యాటరీ, 68 వాట్ల వైర్డు ఛార్జింగ్, 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, త్వరలో ఆండ్రాయిడ్ 14 స్పెసిఫికేషన్ల ఆధారంగా ఫోన్ ధర సుమారు రూ. 45,000 ఉంటుందని అంచనా ఇటీవల విడుదలైన మరిన్ని ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల గురించిన సమాచారం కోసం సాక్షి బిజినెస్ పేజీని చూడండి. -
వైరల్ వీడియో : నాలుగో అంతస్తులో నిలబడి కిటికీ అద్దాలు శుభ్రం చేస్తూ..!
-
వామ్మో.. చూస్తుండగానే 60 అడుగుల కొండపై నుంచి..
లండన్: మనలో చాలా మంది కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి కొండలపైకి, కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అక్కడ తమ వారితో సరదాగా గడిపి ఒత్తిడిని దూరం చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఒక్కొసారి ఈ విహారయాత్రలో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. దీంతో, ఆ విహార యాత్ర కాస్త, విషాద యాత్ర గా మారిపోతుంది. అయితే, యూకేలోజరిగిన ఒక విషాదయాత్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కార్న్‌వాల్ లోని లామోర్నా కోవ్ పట్టణంలో రెబెకా క్రాఫోర్డ్ అనే 37 ఏళ్ల మహిళ తన కుటుంబంతో కలిసి ఉండేది. ఆమె గతేడాది తన సోదరి రెబెకా డెబ్స్తో కలిసి స్థానికంగా ఒక ఎత్తైన కొండపైకి వెళ్లారు. అక్కడ సరదాగా గడపాలను కున్నారు. ఈ క్రమంలో వారిద్దరు మాట్లాడుకుంటూ కొండ అంచుల వద్ద చేరుకున్నారు. అక్కడ చల్లగాలిని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, వారు మాటల్లో పడి కొండ అంచున ఉన్న విషయం కూడా మరిచిపోయారు. అప్పుడు, రెబెకా క్రాఫోర్డ్ కొండపై నుంచి చూస్తుండగానే కాలుజారి కింద పడింది. దీంతో, రెబెకా డెబ్స్ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యింది. తన సోదరి కొండపై నుంచి కింద పడటాన్ని చూసింది. ఆమె నోటినుంచి మాట రాలేదు. తన అక్క అరుపులు, కేకలు వినిపించాయి. వెంటనే తేరుకుని యూకేలోని డయల్ అంబూలెన్స్‌కు ఫోన్ చేసింది. ఆ ప్రాంతం కొండపైన ఉండటంతో కాసేపటికి ఎయిర్ అంబూలెన్స్ సర్వీస్ అక్కడికి చేరుకున్నారు. ఆమెను వెంటనే యూకేలోని ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. అయితే, రెబెకా ప్రస్తుతం కోలుకుంటుదని వైద్యులు తెలిపారు. అయితే, తాజాగా రెబెకా క్రాఫోర్డ్.. మెట్రో.కో.యూకే తో జరిగిన ఇంటర్వ్యూలో ఆ విషాదాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఆ భయంకర సంఘటన నా జీవితంలో మరిచిపోలేను’.. నేను నా సోదరితో కలిసి ఎత్తైన కొండపై ఉన్నప్పుడు అనుకోకుండా కింద పడ్డాను. నా సోదరి అరుపులు నాకు వినిపించాయి. నేను కిందకు పడిపోయేటప్పుడు ఏదైనా పట్టుకోవడానికి ప్రయత్నించాను. కానీ నాకు ఏ ఆధారం దొరకలేదు. నేను బండలపై పడ్డాను. ఆ తర్వాత, నేను స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. రెబెకా డెబ్స్ మాట్లాడుతూ.. ఇలాంటివి బహుశా సినిమాల్లో చూసుంటారు. 60 అడుగుల ఎత్తైన కొండపైనుంచి పడి బతకడం చాలా అరుదని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తు మా సోదరికి పెద్ద గాయాలేవి కాలేవు. ఏలాంటి, రక్త స్రావం జరుగలేదు. కానీ, ముఖం దగ్గర మాత్రం కుట్లు పడ్డాయని తెలిపింది. నడుము దగ్గర చిన్నగా ఫాక్చర్ అయ్యిందని వివరించింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారని తెలిపింది. తమ సోదరిని సమయానికి ఆసుపత్రికి చేర్చిన ఎయిర్ అంబూలెన్స్ సిబ్బందికి రెబెకా సిస్టర్స్ ధన్యవాదాలు తెలిపారు. -
నాలాపై ఇరుక్కుపోయిన కారు...
హన్మకొండ: అదుపు తప్పిన కారు..నాలా పైకి దూసుకెళ్లి ఇరుక్కుపోయింది. వరంగల్ జిల్లా హన్మకొండలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు పక్కనే గల నాలాలోకి దూసుకెళ్లిన కారు.. నాలా అంచుల మధ్య ఇరుక్కుంది. అదృష్టవశాత్తూ.. కారు నాలాలోకి పడిపోకపోవటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తులోకి జారుకోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. -
ఆధార్‌కు ఆందోళన
పెదబయలులో రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులు రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం రెండు గంటల పాటు నిలిచిన ట్రాఫిక్ పెదబయలు : మండలంలో ఆధార్ మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ లబ్ధిదారులు శనివారం పెదబయలు అంబేద్కర్ కూడలిలో బైఠాయించి నినాదాలు చేశారు. పెదబయలు మండలంలో ఐదు చోట్ల మోబైల్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మండల తహాశీల్దార్ చొరవ చూపాలని నినాదాలు చేశారు. పెదబయలు మండలంలోని 23 గ్రామ పంచాయితీలలో ఎక్కువ మందికి ఆధార్ నమోదు కాలేదని వీరు ఆందోళన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రంలో రోజుకు 50 మందిని కూడా నమోదు చేయడం లేదని చెప్పారు. దీనివల్ల 23 పంచాయతీల నుంచి వేలాది మంది వచ్చి మండల కేంద్రంలో అవస్థలు పడుతున్నారని చెప్పారు. నాలుగు నుంచి ఐదు రోజులు నిరీక్షిస్తున్నా ఆధార్ నమోదు కావడం లేదని తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చి అవ స్థలు పడుతున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పారు. తహశీల్దార్ జాడేలేదన్నారు. ఈ నెల చివరి కల్లా అధార్ నమోదు పూర్తి చేయాలని జిల్లా స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా, ఇక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేదని, దీని వల్ల తాము ప్రభుత్వ పథకాలు కోల్పోయే ప్రమాద ం ఉందని అన్నారు. జిల్లాస్థాయి అధికారులు స్పందించి ఆధార్ మండలానికి ఎక్కువ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని మండలాలతో పోలిస్తే పెదబయలు మండలంలోనే ఎక్కువ మందికి ఆధార్ నమోదు కాలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు బొండా సన్నిబాబు, టీడీపీ నాయకులు సీకరి సన్యాసిదొర, వెచ్చంగి కొండయ్య తదితరులు, సీకరి సర్పంచ్ వనల్భ సన్యాసి, గుల్లేలు సర్పంచ్ నాగరాజు, వివిధ గ్రామాల ఆధార్ అబ్ధిదారులు పాల్గొన్నారు.