పోస్టాఫీస్‌లో బ్యాంకింగ్ సేవలు | banking services in post office | Sakshi
Sakshi News home page

పోస్టాఫీస్‌లో బ్యాంకింగ్ సేవలు

Published Tue, Nov 25 2014 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

banking services in post office

హన్మకొండ : హన్మకొండలోని ప్రధాన తపా లా కార్యాలయంలో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు హన్మకొండ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని కార్యాలయంలో కోర్ బ్యాంకింగ్ సేవలను సోమవారం కాకతీయ యూనివ ర్సిటీ ఇన్‌చార్‌‌జ రిజిస్ట్రార్ ఎంవీ.రంగారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్ శాఖలో కోర్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావ డం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మేలు కల గనుందని పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడి నుంచైనా....
కోర్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు దేశంలో ఏ పోస్టాఫీస్ నుంచైనా సేవలు పొందవచ్చని పోస్టల్ శాఖ హన్మకొండ డివిజన్ సూపరింటెండెంట్ జీ.వీ.సత్యనారాయణ తెలిపారు. డబ్బులు డిపాజిట్ చేయడం, బదిలీ తదితర లావాదేవీలను ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చన్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు సునాయా సం వంటి సేవలను ప్రవేశపెట్టిన తపాలా శా ఖ ద్వారా గ్రామీణ ప్రజలకు సులువైన బీమా పథకాలు అమలుచేస్తున్నామని తెలిపారు. కాగా, త్వరలోనే కోర్ బ్యాంకింగ్ సేవ లు జిల్లాలోని పరకాల, జనగామ ప్రధాన తపాలా కార్యాలయాల్లో అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.

అలాగే, వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ లోపు తపాల శాఖ ఏటీఎంలు ప్రారంభమవుతాయని, ఈ మేరకు పనులు జరుగుతున్నాయని వివరించారు. కార్యక్రమంలో హన్మకొం డ హెడ్ పోస్ట్‌మాస్టర్ పి.సమ్మిరెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు వి.వి.స్వామి, ఏవీఎల్‌ఎన్ శివలింగం, ఏవీఎన్.నర్సింహారావు, అలీం, సిస్టం అడ్మినిస్ట్రేటర్లు ధర్మేశ్వర్‌సింగ్ పాషా, గ్రామీణ తపాల ఉద్యోగుల సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి బొద్దున వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement