హన్మకొండ జిల్లా అవసరమా?
జనగామ జిల్లా సాధనకు చేర్యాల ప్రజలు కలిసి రావాలని జనగామ జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంగడి బజారు వ ద్ద చేర్యాల జేఏసీ చైర్మన్ భూమిగారి వెంకట్రాజయ్య అధ్యక్షతన చేర్యాల, మద్దూరు, బచ్చన్నపే ట, నర్మెట గ్రామాల కార్యకర్తల తో బహిరంగ సభ నిర్వహించా రు.
-
కోదండరాంను అడ్డుకోవాలని భావించడం సరికాదు
-
జనగామ జేఏసీ చైర్మన్ దశమంతరెడ్డి
చేర్యాల : జనగామ జిల్లా సాధనకు చేర్యాల ప్రజలు కలిసి రావాలని జనగామ జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంగడి బజారు వ ద్ద చేర్యాల జేఏసీ చైర్మన్ భూమిగారి వెంకట్రాజయ్య అధ్యక్షతన చేర్యాల, మద్దూరు, బచ్చన్నపే ట, నర్మెట గ్రామాల కార్యకర్తల తో బహిరంగ సభ నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గైర్హాజరయ్యారు. దీంతో దశమంతరెడ్డి, రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ముస్త్యాల కిష్టయ్య, సీపీఎం డివిజన్ కా ర్యదర్శి ఆముదాల మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. జనగామ జిల్లా సాధన బహిరంగ సభకు హాజరుకావాలని భావించిన ప్రొఫెసర్ కోదండరాంను అడ్డుకోవాలనే ఆలోచన సరైంది కాదన్నారు. ఒక్కో జిల్లాకు మధ్య దూరం 30 నుంచి 40 కిలోమీటర్లు ఉండాలని చెప్పిన కేసీఆర్.. ప్రతిపాదిత వరంగల్, హన్మకొండ జిల్లాల మధ్య ఎంత దూరం ఉందో ఆలోచించాలన్నారు. అది అవసరమా అన్నారు. ఇప్పటికైనా జనగామ జిల్లా ప్రకటించి చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలన్నారు. బాలలక్ష్మి, దాసరి కళావతి, ఎండీ.అతహర్ అహ్మద్, మల్లిగారి యాదగిరి, మద్దూరు, నర్మెట, బచ్చన్నపేట జేఏసీ నాయకులు, జనగామ, చేర్యాల అడ్వకేట్స్ పాల్గొన్నారు.