
సాక్షి, హైదరాబాద్: టీనేజర్లకు వ్యాక్సినేషన్‌లో హన్మకొండ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో 15–17 ఏళ్లవారికి వ్యాక్సిన్ల పంపిణీ 100 శాతం పూర్తయింది. రాష్ట్రంలో ఈ కేటగిరీలో 100 శాతం పూర్తి చేసుకున్న తొలి జిల్లాగా నిలిచింది. జిల్లాలో 55,694 మంది టీనేజర్లకు టీకాలు అవసరమని లక్ష్యంగా నిర్ధారించగా... అంతకుమించి 101 శాతం మందికి వేశారు.
ఇప్పటివరకు 56,299 డోసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇదే స్ఫూర్తితో వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment