ఎల్లుండి హన్మకొండలో ‘సాక్షి’ ఇన్వెస్టర్ల సదస్సు
► ఉదయం 10 నుంచి 1 గంట వరకూ
► పెట్టుబడులపై నిపుణుల సూచనలు
హైదరాబాద్: సరైన పెట్టుబడి అవకాశాలను ఎంచుకోవడానికి ఇన్వెస్టర్లకు తగిన సూచనలందించేందుకు ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ సదస్సు వరంగల్ జిల్లా హన్మకొండలో ఆదివారం (జనవరి 31) జరగనుంది. స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? భవిష్యత్ అవసరాల కోసం అనువైను పెట్టుబడి అవకాశాలను ఎంచుకోవడం ఎలా? డీమ్యాట్ ఖాతాతో లాభాలేంటి? వంటి అంశాలపై నిపుణులు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు.
కార్యక్రమంలో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్‌ఎల్) రీజనల్ మేనేజర్ శివ ప్రసాద్ వెనిశెట్టి, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సౌత్ రీజనల్ హెడ్ డి.వి.సునీల్ రెడ్డి, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్ మేనేజర్ పద్మనాభ పాల్గొంటారు. హన్మకొండ మెయిన్‌రోడ్‌లోని హోటల్ అశోక్ చాణక్య కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగే ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. సదస్సుకు హాజరయ్యే వారు ఉచిత సభ్యత్వ నమోదు కోసం 95055 55020కు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలి.