Investor Conference
-
Delhi: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
పారిశ్రామికవేత్తల ఫీడ్‌బ్యాక్ వల్లే నెంబర్ వన్‌గా ఉన్నాము: సీఎం జగన్
UPDATES.. ► విశాఖ వేదికగా మార్చిలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం ఇవాళ ఢిల్లీలో జరిగిన సన్నాహక సమావేశం ముగిసింది. ► ఏపీలో పెట్టుబడులు పెట్టిన వారందరికీ కృతజ్ఞతలు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మా వంతు సహకారం అందిస్తాము. ప్రపంచవేదికపై ఏపీని నెలబెట్టడానికి మీ సహకారం మాకు అవసరం. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్‌గా ఉంది. పరిశ్రమల స్థాపనకు మేము చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే మేము నంబర్ వన్‌గా ఉన్నాము. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. 11.43 శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చేస్తున్న రాష్ట్రం ఏపీ. 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో మూడు ఏపీకే రావడం శుభపరిణామం. - సీఎం వైఎస్ జగన్. ► కోవిడ్ సమయంలో ఫ్యాక్టరీ ప్రారంభించాము. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రోత్సాహం అమోఘం. ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసింది. మంచి నైపుణ్యం ఉన్న నిపుణులకు ఏపీలో కొదవలేదు. పరిశ్రమల స్థాపనకు సీఎం జగన్, మంత్రులు, అధికారుల కృషి అద్బుతం. పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. - బి. సంతానం, సీఈవో ఇండియా సెయింట్ గోబైన్ ►స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వడం మా ప్రాధాన్యత. కంపెనీకి ఆపరేషన్‌పై స్థానిక అధికారుల సహకారం బాగుంది. - ఎవర్టన్ టీ ఇండియా డైరెక్టర్ రోషన్ గుణవర్దన ►15వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాము. ఏపీ కేంద్రంగా అధునాతన ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. - అపాచీ అండ్ హిల్‌టాప్ గ్రూప్ డైరెక్టర్ సెర్జియా లీ ►ఏపీలో రూ.వెయ్యి కోట్లతో 2 బిజినెస్ యూనిట్లు ప్రారంభించాము. 2030 నాటికి ఉత్పత్తిని రెండింతలు చేస్తాము. -టోరే ఇండస్ట్రీస్ ఎండీ యమగూచి. ►ఏపీ ప్రభుత్వం మాకు ఎంతో మద్దతు ఇస్తోంది. రూ. 650 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాము. ఎంతో మందికి ఉపాధి కల్పించాము. రాబోయే రోజుల్లో మరిన్ని యూనిట్లు నెలకొల్పుతాము. శ్రీ సిటీ ఫ్యాక్టరీ ఏర్పాటులో ప్రభుత్వ సహకారం మరువలేనిది. మా కంపెనీ ద్వారా 600 ఉద్యోగాలు కల్పించాము. మా కంపెనీలో 50 శాతం మంది మహిళలే. కంపెనీలో ఉద్యోగలంతా స్థానికులే. మొత్తం ఆరు ఆపరేటింగ్ లైన్స్‌తో ప్రొడక్షన్ జరుగుతోంది. అదనంగా మరొక లైన్ ద్వారా ఉత్పత్తి చేయబోతున్నాము. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీనే పెట్టుబడులకు అనుకూలం. - క్యాడ్బరీ ఇండియా ప్రెసిడెంట్ దీపక్ ► ఏపీ బిజినెస్ పాలసీ, మౌలిక వసతులు పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలం. పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు బాగున్నాయి. - తాయి జిన్ పార్క్ కియా మోటర్స్ ఎండీ, సీఈవో ► ఏపీలో పెట్టుబడులకు అద్భుత అవకాశాలు ఉన్నాయి. బల్క్ డ్రగ్స్, స్పైస్ పరిశ్రమల నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యం ఉన్న మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్, సమృద్దిగా ఉంది. -బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి. సాక్షి, ఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ జరుగుతున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారుల బృందం ఉన్నారు. అనంతరం, వివిధ దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యూపీలో డిఫెన్స్ కారిడార్
లక్నో: ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించిన రెండు రక్షణ పారిశ్రామిక కారిడార్లలో ఒకదాన్ని ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటుచేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీని వల్ల రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు, సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ఈ కారిడార్‌ను ఆగ్రా, అలహాబాద్, లక్నో, కాన్పూర్, ఝాన్సీ, చిత్రకూట్లకు విస్తరిస్తామని తెలిపారు. బుధవారం లక్నోలో మొదలైన రెండు రోజుల పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో మోదీ ఈ విషయం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విదేశీ ప్రతినిధులు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా మోదీ యూపీ పారిశ్రామిక అభివృద్ధికి ఉన్న అవకాశాలను ప్రస్తావిస్తూ..యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందన్నారు. ప్రతికూల వాతావరణాన్ని అధిగమించే సామర్థ్యం(పొటెన్షియల్), విధానాలు(పాలసీ), ప్రణాళికలు(ప్లానింగ్), పనితీరు(పెర్ఫామెన్స్) లాంటివి అభివృద్ధికి మార్గాలని, ఈ విషయంలో యూపీ సర్కారు, ప్రజలు మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
పెట్టుబడిదారుల సదస్సుకు నిర్వహణ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో 8 కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సోమవారం జారీ చేశారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకుగాను నీతి ఆయోగ్ చేసిన సూచనల మేరకు ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నవంబర్ 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జరుగనున్న ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంక ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు హాజరు కానున్నారు. నవంబర్ 28న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, విభాగాల అధిపతులతో నగర సుందరీకరణ కమిటీ, రవాణా ఏర్పాట్ల కమిటీ, ట్రాఫిక్ నిర్వహణ, కంట్రోల్ రూం ఆపరేటర్ల కమిటీ, వలంటీర్ కమిటీ, ఎయిర్పోర్ట్, రిసెప్షన్ కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ రిసెప్షన్ కమిటీ, మీడియా కో ఆర్డినేషన్ కమిటీ, సెక్యూరిటీ కో ఆర్డినేషన్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు సమావేశమై ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం కోరింది. ఏర్పాట్ల పరిశీలనకు అమెరికా ప్రభుత్వంతో పాటు నీతి ఆయోగ్ నుంచి ప్రతినిధుల బృందం త్వరలో రానుందని తెలిపింది. సదస్సుకు ఆహ్వానించాల్సిన అతిథులు, ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ప్రముఖులు, వీవీఐపీలకు కానుకలు, స్పాన్సర్ల గుర్తింపు తదితర బాధ్యతలను రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించింది. -
ఎల్లుండి హన్మకొండలో ‘సాక్షి’ ఇన్వెస్టర్ల సదస్సు
► ఉదయం 10 నుంచి 1 గంట వరకూ ► పెట్టుబడులపై నిపుణుల సూచనలు హైదరాబాద్: సరైన పెట్టుబడి అవకాశాలను ఎంచుకోవడానికి ఇన్వెస్టర్లకు తగిన సూచనలందించేందుకు ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ సదస్సు వరంగల్ జిల్లా హన్మకొండలో ఆదివారం (జనవరి 31) జరగనుంది. స్టాక్ మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలి? భవిష్యత్ అవసరాల కోసం అనువైను పెట్టుబడి అవకాశాలను ఎంచుకోవడం ఎలా? డీమ్యాట్ ఖాతాతో లాభాలేంటి? వంటి అంశాలపై నిపుణులు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తారు. కార్యక్రమంలో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) రీజనల్ మేనేజర్ శివ ప్రసాద్ వెనిశెట్టి, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సౌత్ రీజనల్ హెడ్ డి.వి.సునీల్ రెడ్డి, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ బ్రాంచ్ మేనేజర్ పద్మనాభ పాల్గొంటారు. హన్మకొండ మెయిన్రోడ్లోని హోటల్ అశోక్ చాణక్య కన్వెన్షన్ హాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరిగే ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. సదస్సుకు హాజరయ్యే వారు ఉచిత సభ్యత్వ నమోదు కోసం 95055 55020కు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలి. -
మైక్రోసాఫ్ట్‌కు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు
శాన్ ఫ్రాన్సిస్కో: క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో తమ సంస్థకు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. రాబోయే రోజుల్లో మొబైల్ , క్లౌడ్ కంప్యూటింగ్‌కి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని వివరించారు. బిల్డ్ 2015 కాన్ఫరెన్స్‌లో భాగంగా జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కస్టమర్లు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకోవడంలో గణనీయంగా తోడ్పాటు అందించడమే తమ లక్ష్యమని సత్య నాదెళ్ల వివరించారు.