
పరీక్ష రాస్తున్న విద్యార్థులు(ఫైల్)
తెలుగు మీడియం ప్రశ్నపత్రం అందని విద్యార్థులకు హన్మకొండలో బుధవారం మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలుగు మీడియం ప్రశ్నపత్రం అందని విద్యార్థులకు హన్మకొండలో బుధవారం మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 7న జరిగిన నీట్ పరీక్షలో హన్మకొండలోని సెయింట్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్‌లో కొందరు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ప్రశ్నపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇంగ్లీష్‌లో ప్రశ్నపత్రం ఇవ్వటం వల్ల పరీక్ష సరిగా రాయలేకపోయామని.. మళ్లీ నీట్ నిర్వహించాలని విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో ఆ విద్యార్థులకు తెలుగు ప్రశ్నపత్రంతో మళ్లీ పరీక్ష నిర్వహించనున్నారు. వారికి హాల్ టికెట్లు జారీ చేశారు. సెయింట్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్‌లోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 7:30 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తామని, 9:30 తర్వాత అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.