30 లక్షల మందితో ‘సింహగర్జన’ సభ | SIMHA GARJANA With 30 Lakh People | Sakshi
Sakshi News home page

30 లక్షల మందితో ‘సింహగర్జన’ సభ

Jun 7 2018 2:54 PM | Updated on Jun 7 2018 2:54 PM

SIMHA GARJANA With 30 Lakh People - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న జేబీ.రాజు  

హన్మకొండ అర్బన్‌ : ఈ నెల 10న హన్మకొండలో నిర్వహించనున్న దళిత, గిరిజన సింహగర్జన సభను 30 లక్షల మందితో నిర్వహించి.. విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ నాయకులు పిలుపునిచ్చారు. కాజీపేట నిట్‌ సమీపంలోని ఓ గార్డెన్‌లో బుధవారం రాత్రి  అన్నమల్ల ఆనందం అధ్యక్షతన  ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేబీ రాజు మాట్లాడుతూ కుట్రపూరితంగా ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని కోర్టుల ద్వారా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ సమయంలో ఎస్సీ,ఎస్టీలు చైతన్యంతో ఐక్యంగా ముందుకు సాగి హక్కులను కాపాడుకోవాలని, అంబేడ్కర్‌ ఆశయాలను సాధించుకోవాలని కోరారు. సంహగర్జన సభ విజయవంతంతో కుట్రలు భగ్నం చేయాలన్నారు. ప్రొఫెసర్‌ గాలి వినోద్‌కుమార్, ఎంఈఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గడ్డం తిరుపతి, ప్రధానకార్యదర్శి మందరాజు, జాతీయ నాయకులు రాజయ్య, తోట శ్రీనివాస్, మంద వీరస్వామి, ఉపేందర్, తిప్పారపు లక్ష్మణ్, కృష్ణయ్య, జాకబ్, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement