హన్మకొండ జిల్లాకు పీవీ పేరు పెట్టాలి
Published Mon, Sep 5 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయనున్న హన్మకొండ జిల్లాకుమాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని బ్రాహ్మణసంఘం కోరారు. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడారు. దేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన పీవీ పేరును హన్మకొండ జిల్లాకు పెట్టాలని బ్రాహ్మణుల పక్షాన కోరుతున్నామన్నారు. వేయి స్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికవడంతో పాటు ప్రధానిగా దేశానికి సేవలందించిన పీవీ పేరును జిల్లాకు పెట్టి గౌరవించాలని కోరారు. డాక్టర్ వొడితెల విశ్వనాథం మాట్లాడుతూ పీవీ పేరును జిల్లాకు పెట్టడం సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ ఆలయాల అర్చకులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు చెప్పెల నాగరాజుశర్మ, దండాపంతుల గోపీనాథ్‌శర్మ, వల్లూరి పవన్‌కుమార్, జయప్రసాద్‌రావు, దెందుకూరి సోమనాథ్, ఎన్‌వీఎన్.పురుషోత్తం, రమేష్‌చంద్ర, గణపతిశర్మ, ప్రభాకర్‌రావు, హన్మంతుశర్మ, ధీరజ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement