brahmana sangham
-
సింగపూర్ తెలుగు బ్రాహ్మణ సమాజం దశమ వార్షికోత్సవం
-
ఏదీ భరోసా?
మల్కాజిగిరి: ఏ ఇంటిలో ఎలాంటి కార్యక్రమం జరగాలన్నా బ్రాహ్మణులు కీలకం. వీరిలో పురోహితం చేసేవారు కొందరైతే, అపరకర్మలు, జపదానాలు తీసుకునే బ్రాహ్మణులు, భోక్తలుగా వెళ్లే బ్రాహ్మణలు వారి వీలునుబట్టి వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు. మల్కాజిగిరి ఆర్కెనగర్లో లక్ష్మీ విలాస్ బ్యాంక్ వద్ద నిత్యం పదుల సంఖ్యలో బ్రాహ్మణులు ఉదయం నుంచి కూర్చొని ఉంటారు. లాక్డౌన్ కన్నా ముందు వారి పరిస్థితి కొంత మెరుగ్గానే ఉండేది. ఎవరైనా జపదానాలు చేసే వారు ఉంటే దానం తీసుకునే వారు, శార్ధకర్మలకు భోక్తలుగా వెళ్లేవారు కొంత మంది , అపరకర్మలు నిర్వహించడానికి మరికొంత మందికి పనిదొరికేది. లాక్‌డౌన్‌తో తప్పని తిప్పలు లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి వారి పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా దేవాలయాల్లో కొంత మంది వారి వారి గ్రహస్థితిని బట్టి జపాలు చేయించుకొని దానాలు చేస్తుంటారు. ఇప్పుడు దేవాలయాల్లో అటువంటి కార్యక్రమాలు జరగడం లేదు. అపరకర్మ కార్యక్రమాలు కూడా తక్కువగా జరుగతుండడంతో ఎక్కువ సంఖ్యలో బ్రాహ్మణులకు పని దొరకడం లేదు. దీనితో రోజూ వారు పనికోసం వచ్చి ఆశగా ఎదురుచూసి తిరిగి నిరాశతో ఇంటికి వెళ్లిపోతున్నారు. వీరిలో సొంత ఇండ్లు లేకపోవడంతో అద్దె చెల్లించే కష్టంతో పాటు ఇల్లు గడవడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఎవరినీ అడగలేని పరిస్థితిలో వీరు జీవనం సాగిస్తున్నారు.ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పరిస్థితి దారుణంగా ఉంది లాక్డౌన్ వచ్చిన తర్వాత పరిస్థితి దారుణంగా మారింది. పనులు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. ఇంటి అద్దెలతో పాటు ఇల్లు గడవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్ధానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. మల్కాజిగిరిలోనే సుమారు వంద మంది పైగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. – అనంత క్రిష్ణ ప్రభుత్వం ఆదుకోవాలి దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల్లో పనిచేసే వారికి వేతనాలు అందజేస్తున్నది. మరి కొన్ని దేవాలయాల్లో ధూపదీపాలకు, పూజార్లకు కొంత మొత్తాన్ని అందజేస్తున్నారు. అదే విధంగా నిత్యం పురోహితం చేసేవారు, భోక్తలుగా వెళ్లేవారు, అపరికర్మలు నిర్వహించే వారికి ఆర్ధికంగా చేయూత నందించాలి. అర్హులైన వారికి ఫించను అందేలా చూడాలి– వి. సుధాకర శర్మ -
పేద బ్రాహ్మణులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పేద బ్రాహ్మణులకు అండగా ఉంటుందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. బ్రాహ్మణుల స్థితిగతులపై సీఎంకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. గురువారం నెక్లెస్ రోడ్‌లోని వండర్ ఫన్ పార్కులో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం 2017–18లో 17 కొత్త పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు గతంలో రూ.5 వేలు జీతం ఉండగా.. ఇప్పుడు రూ.25 నుంచి రూ.50 వేల వరకు ట్రెజరీల ద్వారా పొందుతున్నారన్నారు. ఏ రాష్ట్రంలో లేనట్లుగా దేవాలయాల అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు కేసీఆర్ విడుదల చేశారని గుర్తు చేశారు. యాదాద్రి, వేములవాడ, ధర్మపురి, బాసర, భద్రాచలం లాంటి ఆలయాలను ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక కామన్‌గుడ్ ఫండ్ చాలా తక్కువగా ఉండగా సీఎం రూ.250 కోట్లు కేటాయించి 269 దేవాలయాల పునరుద్ధరణ చేశారన్నారు. గతంలో 1,800 దేవాలయాలకే ధూపదీప నైవేధ్యాలు అందిస్తుండగా మరో 200 ఆలయాలను ఇందులో చేర్చామని, మరో 1,200 ఆలయాలకు త్వరలో దీన్ని వర్తింప చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల వరంగల్‌లో దుండగుల దాడిలో మరణించిన అర్చకుడు సత్యనారాయణ శర్మకు కనీసం నివాళులు కూడా అర్పించలేదంటూ ఇద్దరు వ్యక్తులు నినాదాలు చేశారు. మంత్రి స్పందిస్తూ సత్యనారాయణ శర్మ కుటుంబాన్ని ఆదుకోవడంతోపాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుం టామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచారి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మృత్యుంజయ శర్మ, కార్పొరేటర్ నరేంద్రచారి, ఆయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుకు ఇక్కడేం పని.. ఆంధ్రప్రదేశ్‌లో చేయాల్సిన పనులన్నీ వదిలి చంద్రబాబు ఇక్కడేం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో ధర్మపురి గోదావరి పుష్కరాలకు వచ్చిన చంద్రబాబు నెత్తిపై నీళ్లు చల్లుకుంటుంటే అక్కడ బ్రాహ్మణులు నీళ్లలో మునగాలని ఆయనకు చెప్పారని, అయితే పక్కనున్న ఆయన సహాయకుడు సార్(చంద్రబాబు)కు ముంచుడు తప్ప.. మునగడం తెలియదన్నారని కేటీఆర్ చమత్కరించారు. ‘బ్రాహ్మణుల ఓట్లు టీఆర్ఎస్కు వేయిద్దాం’ బ్రాహ్మణులందరూ ఒక్కతాటిపై ఉండి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించాలని తెలంగాణ అర్చక సమాఖ్య అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. మతైక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, నల్లకుంట రామాలయ అర్చకుడు గంగు భానుమూర్తి మాట్లాడుతూ అర్చక, ఉద్యోగ సంఘాలు కేసీఆర్‌కు రుణపడి ఉంటాయని తెలిపారు. -
విజయవాడలో బ్రాహ్మణ ఐక్య వేదిక నిరసన
-
‘హిందూ ధర్మంపై బాబు సర్కార్ దాడి’
సాక్షి, విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను రాష్ట్ర ప్రభుత్వం దిగజారుస్తుందని ఆరోపిస్తూ.. ప్రభుత్వ వివాదాస్పద విధానాలను వ్యతిరేకిస్తూ విజయవాడలో బ్రాహ్మణ ఐక్య వేదిక ఆద్వర్యంలో బ్రహ్మణులు శాంతి యాత్ర చేపట్టారు. బెంజి సర్కిల్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రతినిధుల మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ హిందుధర్మంపై దాడికి దిగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. అర్చక వృత్తిని దెబ్బతీసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రమణ దీక్షితుల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వామి వారి ప్రతిష్టతను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. దీనికి వ్యకిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు. -
హన్మకొండ జిల్లాకు పీవీ పేరు పెట్టాలి
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేయనున్న హన్మకొండ జిల్లాకుమాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టాలని బ్రాహ్మణసంఘం కోరారు. హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడారు. దేశంలో ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచిన పీవీ పేరును హన్మకొండ జిల్లాకు పెట్టాలని బ్రాహ్మణుల పక్షాన కోరుతున్నామన్నారు. వేయి స్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ హన్మకొండ నుంచి ఎంపీగా ఎన్నికవడంతో పాటు ప్రధానిగా దేశానికి సేవలందించిన పీవీ పేరును జిల్లాకు పెట్టి గౌరవించాలని కోరారు. డాక్టర్ వొడితెల విశ్వనాథం మాట్లాడుతూ పీవీ పేరును జిల్లాకు పెట్టడం సీఎం కేసీఆర్ దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ ఆలయాల అర్చకులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు చెప్పెల నాగరాజుశర్మ, దండాపంతుల గోపీనాథ్శర్మ, వల్లూరి పవన్‌కుమార్, జయప్రసాద్‌రావు, దెందుకూరి సోమనాథ్, ఎన్వీఎన్.పురుషోత్తం, రమేష్‌చంద్ర, గణపతిశర్మ, ప్రభాకర్‌రావు, హన్మంతుశర్మ, ధీరజ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.