తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టను రాష్ట్ర ప్రభుత్వం దిగజారుస్తుందని ఆరోపిస్తూ.. ప్రభుత్వ వివాదాస్పద విధానాలను వ్యతిరేకిస్తూ విజయవాడలో బ్రాహ్మణ ఐక్య వేదిక ఆద్వర్యంలో బ్రహ్మణులు శాంతి యాత్ర చేపట్టారు. బెంజి సర్కిల్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న బ్రాహ్మణ ఐక్య వేదిక ప్రతినిధుల మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ హిందుధర్మంపై దాడికి దిగిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. అర్చక వృత్తిని దెబ్బతీసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రమణ దీక్షితుల విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వామి వారి ప్రతిష్టతను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. దీనికి వ్యకిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తామని అన్నారు.
విజయవాడలో బ్రాహ్మణ ఐక్య వేదిక నిరసన
Published Wed, May 23 2018 10:44 AM | Last Updated on Thu, Mar 21 2024 8:29 PM
Advertisement
Advertisement
Advertisement