
హన్మకొండ చౌరస్తా: ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ హోదా మరిచి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పులిబిడ్డ కాదు.. పిల్లి బిడ్డ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడిన కేసీఆర్‌పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. హనుమకొండ కాకాజీ కాలనీలోని మాజీ ఎంపీ జంగారెడ్డి ఇంటికి ఆదివారం వచ్చిన అరుణ.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
జంగారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్లి అక్కడ విలేకరులతో మాట్లాడారు. కొద్ది రోజులుగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు క్షమించరానివని, వెంటనే కేసీఆర్ ప్రధానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పదవి ఊడుతుందనే తీవ్ర మానసిక ఒత్తిడిలో ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్‌కు అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment