
హన్మకొండ చౌరస్తా: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్‌ఆర్ కళాశాలల విద్యార్థులు మెరు గైన ప్రతిభ కనబర్చారు. హనుమకొండ కాకాజీ కాలనీలోని కళాశాల ఆవరణలో ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవ త్సరంలో ఎంపీసీ విభాగంలో 36 మంది విద్యార్థులు 467 మార్కులు సాధించారని, బైపీసీలో 9 మంది 437 మార్కులతో ప్రతిభ కనబరిచారని తెలిపారు.
సీఈసీలో ఒకరు 491 మార్కులు, ఎంఈసీలో ఇద్దరు 492 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో ఒకరు 992, ఇద్దరు 990, ఎంపీసీలో ఆరుగురు విద్యా ర్థులు 991 మార్కులు సాధించారని చెప్పారు. ఎంఈసీలో ఒకరు 983 మార్కులు, సీఈసీలో ఒకరు 979 మార్కులు సాధించారని తెలిపారు.