sr college
-
ఇంటర్ ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రతిభ
హన్మకొండ చౌరస్తా: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్ఆర్ కళాశాలల విద్యార్థులు మెరు గైన ప్రతిభ కనబర్చారు. హనుమకొండ కాకాజీ కాలనీలోని కళాశాల ఆవరణలో ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవ త్సరంలో ఎంపీసీ విభాగంలో 36 మంది విద్యార్థులు 467 మార్కులు సాధించారని, బైపీసీలో 9 మంది 437 మార్కులతో ప్రతిభ కనబరిచారని తెలిపారు. సీఈసీలో ఒకరు 491 మార్కులు, ఎంఈసీలో ఇద్దరు 492 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో ఒకరు 992, ఇద్దరు 990, ఎంపీసీలో ఆరుగురు విద్యా ర్థులు 991 మార్కులు సాధించారని చెప్పారు. ఎంఈసీలో ఒకరు 983 మార్కులు, సీఈసీలో ఒకరు 979 మార్కులు సాధించారని తెలిపారు. -
ఎస్ఆర్ విద్యార్థుల విజయభేరి
సాక్షి, కాజీపేట: జేఈఈ(మెయిన్స్)లో ఎస్ఆర్ విద్యాసంస్ధల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని ఎస్ఆర్ విద్యాసంస్థల కార్యాలయంలో విద్యార్థులను శనివారం ఆ సంస్థల చైర్మన్ వరదారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జేఈఈ(మెయిన్స్) ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన ఎం.చేతన్ (ఏపీపీ నెంబర్ 200310022672) జాతీయ స్ధాయిలో రిజర్వేషన్ కేటగిరిలో 39వ ర్యాంకు, డి.సాయిరోహిత్‌రెడ్డి (ఏపీపీ నెంబర్ 2003189958) రిజర్వేషన్ కేటగిరిలో 115వ ర్యాంకు, పి.సంతోష్‌వ్యాస్ (ఏపీపీ నెంబర్ 200310009430) రిజర్వేషన్ కేటగిరిలో 141వ ర్యాంకు సాధించారని తెలిపా రు. జేఈఈ(అడ్వాన్స్డ్)కు 916 మంది పైగా ప్రవేశానికి అర్హత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
బోడుప్పల్: ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్ కాలేజీలో చోటు చేసుకుంది. ఎస్సై రఘ రాం, విద్యార్థులు తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి జిల్లా, ఆత్మకూరుకు చెందిన బొడిగె లక్ష్మినారాయణ, స్వాతి దంపతుల కుమారుడు సాయికిరణ్(17) బోడుప్పల్‌లోని ఎస్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్స రం చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం తోటి విద్యార్థులు భోజనం చేసేందుకు వెళ్లగా, గదిలో ఒంటరిగా ఉన్న సాయికిరణ్ టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన కాలేజీ నిర్వాహకులు అతడిని స్పార్క్ హాస్పిటల్‌కు తరలించగా, పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. యాజమాన్యం వేధింపులే కారణం... తమ కుమారుడి మృతికి ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యం వేధింపులే కారణమని మృతుని తల్లిదండ్రులు లక్ష్మినారాయణ, స్వాతి ఆరోపించారు. చదువు పేరుతో ఒత్తిడి చేసినందునే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదువుకోవడం ఇష్టం లేకే.... హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేకే సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాలేజీ నిర్వాహకులు తెలిపారు. జూలై 22న అతను తమ కాలేజీలో చేరాడని అంతకు ముందు సింగ పూర్ టౌన్‌షిప్‌లోని నారాయణ కాలేజీలో చదువు కున్నాడన్నారు. అక్కడ కూడా చదువుకోవడం ఇష్టం లేక ఆత్మహత్యకు యత్నించినట్లు వారు తెలి పారు. బయట ఉండేందుకే అతను ఇష్టపడ్డాడని, అయితే తల్లిదండ్రులు బలవంతంగా హాస్టల్లో ఉంచినందునే ఆత్మహత్య చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీ య పార్టీల నేతలు బోడుప్పల్‌లోని కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు. కాలేజీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కాలేజీ భవనంపై నుంచి దూకిన విద్యార్థిని
కాలేజీ హాస్టల్ భవనంపై దూకడంతో విద్యార్థినికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజామాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని దర్పల్లి మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన అలేఖ్య నిజామాబాద్ పట్టణంలోని ఎస్ఆర్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్లోఉంటోంది. మంగళవారం ఉదయం ఆమె హాస్టల్ భవనంపై నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు చికిత్సనందిస్తున్నారు. కాగా, హాస్టల్ భవనంలోని మెట్లపై నుంచి అలేఖ్య జారి పడిపోయిందని కళాశాలవారు విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినే దూకినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఓ లెక్చరర్ వేధింపులు కారణమని కొందరు విద్యార్థులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇంటర్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రతిభ
హన్మకొండ, న్యూస్‌లైన్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో వరంగల్‌లోని ఎస్ఆర్ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టు ఆ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి, డెరైక్టర్ సంతోష్‌రెడ్డి తెలిపారు. ఎంపీసీ విభాగంలో డి.వైష్ణవి, ఎ.శిరీష 987 మార్కులు సాధించారని, బైపీసీలో బి.మధురిమ 983, తంజీల 982 మార్కులు సాధించారని తెలిపారు. ఎంఈసీలో ఎం.సాయిచంద్రిక 965, సీఈసీలో సాదియూ తహసీన్ 942 మార్కులు సాధించారన్నారు. అలాగే, ఎస్ఆర్ కాలేజీకి చెందిన కర్నాటి వినోద్‌రెడ్డి జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకుగాను 345 మార్కులు సాధించాడని చైర్మన్ ఎ.వరదారెడ్డి పేర్కొన్నారు. తమ విద్యాసంస్థలకు చెందిన 405మంది జేఈఈకి అర్హత సాధించారని తెలిపారు. -
నేటి నుంచి ఏబీవీపీ మహాసభలు
శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లై న్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 32వ మహాసభలు నేటి నుంచి జిల్లాకేంద్రంలో ప్రారంభం కాను న్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగరం కాషాయమయమైంది. ఎక్కడ చూసినా ఏబీవీపీ బ్యానర్లు, పోస్టర్లు కనిపిస్తున్నాయి. మహాసభలు విజయవంతం చేసేందుకు ఎస్సారార్ కాలేజీ మైదానంలో తగిన ఏర్పాట్లు చేశారు. దేశ, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులు, మేధావులు, ఆచార్యుల కోసం ప్రత్యేక గాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యారంగ సమస్యలపై గతంలో ఏబీవీపీ చేసిన ఉద్యమాలు, సాధించిన విజ యాలకు సంబంధిచి ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేశారు. సభల అనంతరం జిల్లా నూతనకమిటీని నియమించనున్నారు. షెడ్యూల్ ఇదే.. మొదటి రోజైన 24న శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి, ఏబీ వీపీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ సభలను ప్రారంభించి ప్రసంగిస్తారు. 25న గౌరీశంకర్ మెమోరియల్ యువపుస్కార్ ప్రదానోత్సవం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎల్.నర్సింహారెడ్డి హాజరై ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎస్సారార్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, 5 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. 26న భవిష్యత్ కార్యాచరణపై ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జోనల్ సెక్రెటరీ గుంత లక్ష్మణ్ ప్రసంగిస్తారు. ఏర్పాట్లను పర్యవేక్షించిన నాయకులు.. ఏబీవీపీ మూడు రాష్ట్రాల ఇన్చార్జి లక్ష్మణ్‌జీ, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మాసాడి బాపురావు, ఎ.భానుప్రకాశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మధుకర్, మాజీ కార్పొరేటర్ బండి సంజయ్ సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.