శాతవాహన యూనివర్సిటీ, న్యూస్‌లై న్ :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 32వ మహాసభలు నేటి నుంచి జిల్లాకేంద్రంలో ప్రారంభం కాను న్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగరం కాషాయమయమైంది. ఎక్కడ చూసినా ఏబీవీపీ బ్యానర్లు, పోస్టర్లు కనిపిస్తున్నాయి. మహాసభలు విజయవంతం చేసేందుకు ఎస్సారార్ కాలేజీ మైదానంలో తగిన ఏర్పాట్లు చేశారు. దేశ, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే విద్యార్థులు, మేధావులు, ఆచార్యుల కోసం ప్రత్యేక గాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యారంగ సమస్యలపై గతంలో ఏబీవీపీ చేసిన ఉద్యమాలు, సాధించిన విజ యాలకు సంబంధిచి ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేశారు. సభల అనంతరం జిల్లా నూతనకమిటీని నియమించనున్నారు.
షెడ్యూల్ ఇదే..
మొదటి రోజైన 24న శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి, ఏబీ వీపీ జాతీయ అధ్యక్షుడు మురళీ మనోహర్ సభలను ప్రారంభించి ప్రసంగిస్తారు. 25న గౌరీశంకర్ మెమోరియల్ యువపుస్కార్ ప్రదానోత్సవం ఉంటుంది. దీనికి ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.ఎల్.నర్సింహారెడ్డి హాజరై ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఎస్సారార్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, 5 గంటలకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. 26న భవిష్యత్ కార్యాచరణపై ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జోనల్ సెక్రెటరీ గుంత లక్ష్మణ్ ప్రసంగిస్తారు.
ఏర్పాట్లను పర్యవేక్షించిన నాయకులు..
ఏబీవీపీ మూడు రాష్ట్రాల ఇన్‌చార్జి లక్ష్మణ్‌జీ, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ మాసాడి బాపురావు, ఎ.భానుప్రకాశ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మధుకర్, మాజీ కార్పొరేటర్ బండి సంజయ్ సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేటి నుంచి ఏబీవీపీ మహాసభలు
Published Tue, Dec 24 2013 3:01 AM | Last Updated on Tue, Oct 2 2018 8:08 PM
Advertisement