
సాక్షి, కాజీపేట: జేఈఈ(మెయిన్స్)లో ఎస్‌ఆర్ విద్యాసంస్ధల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి విజయభేరి మోగించారు. ఈ సందర్భంగా హన్మకొండలోని ఎస్‌ఆర్ విద్యాసంస్థల కార్యాలయంలో విద్యార్థులను శనివారం ఆ సంస్థల చైర్మన్ వరదారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జేఈఈ(మెయిన్స్) ఫలితాల్లో ఎస్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన ఎం.చేతన్ (ఏపీపీ నెంబర్ 200310022672) జాతీయ స్ధాయిలో రిజర్వేషన్ కేటగిరిలో 39వ ర్యాంకు, డి.సాయిరోహిత్‌రెడ్డి (ఏపీపీ నెంబర్ 2003189958) రిజర్వేషన్ కేటగిరిలో 115వ ర్యాంకు, పి.సంతోష్‌వ్యాస్ (ఏపీపీ నెంబర్ 200310009430) రిజర్వేషన్ కేటగిరిలో 141వ ర్యాంకు సాధించారని తెలిపా రు. జేఈఈ(అడ్వాన్స్‌డ్)కు 916 మంది పైగా ప్రవేశానికి అర్హత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల డైరెక్టర్లు మధుకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment