హన్మకొండ చౌరస్తా: మడికొండలో కార్యక్రమం లో పాల్గొని భోజన సమయంలో హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అధికారిక నివాసానికి బయల్దేరిన కేటీఆర్ వాహనాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. కేటీఆర్ అధికారిక వాహనంలో కాకుండా ప్రైవేటు కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడి క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తులో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా కేటీఆర్ కారును అడ్డుకోబోయాడు. దీంతో కేటీఆర్ వెనుకున్న ఎస్కార్ట్ వాహనాలు ముందుకొచ్చి కానిస్టేబుల్‌కు విషయాన్ని చెప్పడంతో అతడు తప్పుకొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment