traffic police constable
-
ఇంత దారుణమా? చలానా కట్టమన్నందుకు 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు
భోపాల్: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటమే కాకుండా ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. చలాన్ కట్టమన్నందుకు కారు బానట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగింది. ఇండోర్ నగరంలోని సత్య సాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివ సింగ్ చౌహాన్(50) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కారులో వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఫోన్ మాట్లాడటం తప్పు అని చెప్పి జరిమానా కట్టాలని సూచించాడు కానిస్టేబుల్. దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్.. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. జరిమానా తప్పించుకునేందుకు కానిస్టేబుల్ అడ్డుగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పోలీసు కారు బానట్పైకి దూకాడు. అయినప్పటికీ.. కారును ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు కారు నడిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 279, 332 కింద కేసు నమోదు చేసినట్లు లసుదియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ దండోతియా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పిస్తోల్, ఓ రివాల్వర్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అవి లైసెన్స్‌తో తీసుకున్నవని నిందితుడు తెలిపాడన్నారు. ग्वालियर के केशव उपाध्याय ने इंदौर में गाड़ी चलाने के दौरान फोन पर बात करते हुए ट्रैफिक तोड़ा और रोकने पर ट्रैफिक कांस्टेबल शिव सिंह चौहान को चार किलोमीटर तक अपने बोनट पर टांग कर ले गए। बताया जा रहा है के FIR कर छोड़ दिया गया।pic.twitter.com/PXEhQ3lm31 — काश/if Kakvi (@KashifKakvi) December 12, 2022 ఇదీ చదవండి: మూన్‌లైటింగ్ కూలీ: రాత్రి పూట రైల్వే స్టేషన్లో.. మరి పగటి పూట! -
కేటీఆర్ వాహనమని తెలియక!
హన్మకొండ చౌరస్తా: మడికొండలో కార్యక్రమం లో పాల్గొని భోజన సమయంలో హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అధికారిక నివాసానికి బయల్దేరిన కేటీఆర్ వాహనాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. కేటీఆర్ అధికారిక వాహనంలో కాకుండా ప్రైవేటు కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడి క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తులో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా కేటీఆర్ కారును అడ్డుకోబోయాడు. దీంతో కేటీఆర్ వెనుకున్న ఎస్కార్ట్ వాహనాలు ముందుకొచ్చి కానిస్టేబుల్‌కు విషయాన్ని చెప్పడంతో అతడు తప్పుకొన్నాడు. -
పని చేస్తుండగానే ప్రాణాలు వదిలిన పోలీస్
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని రంజాన్ పండుగ సందర్భంగా ఖిల్లా వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పి.ఆనందం(43) ఖిల్లా వద్ద విధుల్లో ఉన్నారు. ఆకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కిందపడిపోయాడు. పక్కనే ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆనందం తుది శ్వాస వదిలాడు. నగరంలోని హోప్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. 2000 బ్యాచ్‌కు చెందిన పుల్లూరి ఆనందం సూర్యపేట జిల్లా తుంగతుర్థికి చెందినవారు. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కొన్నేళ్లుగా ఆనందం కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేశాడు. మూడున్నేళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వరిస్తున్నారు. అయితే సీపీ కార్తీకేయ ఆనందం మృతి చెందిన విషయం తెలుసుకొని ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీసు వాహనంలో ఆనందం మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు. -
మహిళ పోలీసు వద్ద నగదు దోపిడి
తిరువొత్తియూరు: ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ వద్ద నగదు దోపిడీ చేశారు. చెన్నై కీల్పాకం లోటస్ కాలనీకి చెందిన కల్పన (39). ఈమె కీల్పాకం ట్రాఫిక్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్. మంగళవారం రాత్రి పని ముగించుకుని సైకిల్‌పై ఇంటికి వెళుతూ మార్గమధ్యంలో ఓ ఏటీఎం సెంటర్లో రూ.14 వేలను డ్రా చేసుకున్నారు. తరువాత నగదును, ఏటీఎం కార్డును బ్యాగులో ఉంచి దాన్ని సైకిల్ ముందు స్టాండులో పెట్టి ఇంటికి బయలుదేరారు. డాక్టర్ మునియప్ప రోడ్డులో వెళుతుండగా వెనుక బైకులో వెంబడించిన ఇద్దరు యువకులు కల్పన సైకిల్‌పై ఉంచిన హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కుని పారిపోయారు. దిగ్భ్రాంతి చెందిన కల్పన దీనిపై కీల్పాకం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ట్రాఫిక్ క్లియర్ చేయబోయి...
శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై గత అర్థరాత్రి అతివేగంతో వెళ్తున్న ఓ లారీ డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న కానిస్టేబుల్‌పైకి మరో లారీ దూసుకువచ్చింది. ఆ ప్రమాదంలో ట్రాఫిక్ కానిస్టేబులు మృతి చెందాడు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్నవాహనదారులు వెంటనే స్పందించి లారీ డ్రైవర్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.