ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆనందం మృతదేహం
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని రంజాన్ పండుగ సందర్భంగా ఖిల్లా వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. మధ్యాహ్నం 11 గంటల సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పి.ఆనందం(43) ఖిల్లా వద్ద విధుల్లో ఉన్నారు. ఆకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కిందపడిపోయాడు. పక్కనే ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆనందం తుది శ్వాస వదిలాడు.
నగరంలోని హోప్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. 2000 బ్యాచ్‌కు చెందిన పుల్లూరి ఆనందం సూర్యపేట జిల్లా తుంగతుర్థికి చెందినవారు. ఇతడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. కొన్నేళ్లుగా ఆనందం కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేశాడు. మూడున్నేళ్లుగా ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వరిస్తున్నారు. అయితే సీపీ కార్తీకేయ ఆనందం మృతి చెందిన విషయం తెలుసుకొని ఆస్పత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోలీసు వాహనంలో ఆనందం మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment