బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన హరీష్
Published Sat, Apr 8 2017 3:46 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
హన్మకొండ: టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 27న హన్మకొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరిలు శనివారం పరిశీలించారు. సుమారు 190 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభ కోసం భారీగా పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాలు గతంలో కంటే ఎంతో బాగా జరుగుతున్నాయన్నారు. కొన్ని గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా సభ్యత్వం తీసుకునేందుకు ముందుకొస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు సభ్యత్వం నమోదు చేసుకున్న వారి సంఖ్య 70లక్షలు దాటిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. మూడేళ్ల తమ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని సంపాదించిందన్నారు. 27న నిర్వహించనున్న సభకు చేస్తున్న ఏర్పాట్లను చూసిన హరీశ్‌రావు వారిని అభినందించారు. సభకు వచ్చిన వారు ఏమాత్రం అసౌకర్యానికి గురికాకుండా తాగునీరు, రవాణ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Advertisement
Advertisement