బీఈడీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఆర్జేడీ బాలయ్య | BEd college principal in charge of the recent RJD | Sakshi
Sakshi News home page

బీఈడీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా ఆర్జేడీ బాలయ్య

Published Fri, Aug 12 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

BEd college principal in charge of the recent RJD

విద్యారణ్యపురి: హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా పాఠశాల విద్యాశాఖ ఆర్‌జేడీ వై.బాలయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ డైరెక్టర్‌ జి.కిషన్‌ గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సహదేవుడు తమపై అనుచి తంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ పలుమార్లు కళాశాల విద్యార్థులు ఆందోళనలు, ధర్నాలు చేసిన విషయం విధితమే. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద ధర్నా, ఫిర్యాదు కూడా చేశారు.
 
మంత్రి కడియం శ్రీహరి దృష్టికి  సైతం తీసుకెళ్లారు. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ జగన్నాథరెడ్డి ఇటీవల కళాశాల సందర్శించి విచారణ జరిపారు. నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు అందజేశారు. ఈమేరకు ఆయ న స్థానంలో ఇన్‌చార్జిగా ఆర్జేడీ బాలయ్యను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సహదేవుడు ప్రస్తుతం సెలవులో ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement