BED college
-
ప్రభుత్వం మాది.. మా మాటే వినవా?
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్): స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరి శీలనలో నిబంధనల మేరకు వ్యవహరిస్తామని చెప్పిన రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, ప్రొఫెసర్ బి.అమర్నాథ్పై ప్రైవేట్ బీఈడీ కళా శాలల యాజమాన్యాల సభ్యులు తీవ్ర దుర్భాషలాడుతూ దాడికి యత్నించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంగళవారం వర్సిటీలో స్టాఫ్ అప్రూవల్ కమిటీ బీఈడీ కళాశాలల అధ్యాపకుల ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. నిబంధనల మేరకు అధ్యాపకుల ధ్రువపత్రాలను తమ వద్ద నెల రోజుల పాటు డిపాజిట్ చేసుకుంటామని కమిటీ తెలిపింది. దీంతో ప్రైవేట్ బీఈడీ కళాశాలల యాజమాన్యాల సంఘం నాయకుడు, కర్నూలు ఎస్ఎల్వీ బీఈడీ కళాశాల కరస్పాండెంట్ తిరుపతయ్యగౌడ్ వెరిఫికేషన్‌ను అడ్డుకుని.. అధ్యాపకులందరినీ బయటికి పంపించేశారు. ఆయనతో పాటు అనంతపురం ఎస్కే యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్పచౌదరి, మరికొందరు బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఫూటుగా మద్యం సేవించి సాయంత్రం రిజిస్ట్రార్ ఛాంబర్‌కు వచ్చి నానా దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. ‘‘సీఎం మావాడు..మంత్రి మావాడు.. ఇది మా ప్రభుత్వం..మా మాట వినకపోతే నీ సంగతి చూస్తాం..నిన్ను బతకన్విం’’.. అంటూ రిజిస్ట్రార్‌ను నానా దుర్భాషలాడారు. రత్నప్పచౌదరి చెప్పు తీసి దాడి చేయడానికి యత్నించగా అక్కడున్న ఉద్యోగులు అడ్డుకుని వారించారు. వర్సిటీలోని ఉద్యోగులంతా వచ్చి రిజిస్ట్రార్‌కు అండగా నిలవడంతో వారు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ విషయమై కర్నూలు తాలూకా ఎస్ఐ భాస్కరరాజును సాక్షి వివరణ కోరగా.. గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని..యూనివర్సిటీ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. కాగా రిజిస్ట్రార్, ప్రొఫెసర్ అమర్నాథ్పై దాడిని నిరసిస్తూ ఆర్యూ విద్యార్థి జేఏసీ బుధవారం వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. -
‘డి’ ర్యాంకు వస్తే మూసివేతే!
ఉపాధ్యాయ విద్య కాలేజీలకు ఎన్సీటీఈ ర్యాంకింగ్ సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఉపా ధ్యాయ విద్యా కాలేజీలకు ర్యాంకులు ఇవ్వా లని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిర్ణయించింది. ముఖ్యంగా బీఎడ్ కాలేజీలతో ముందుగా ఈ విధానం అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఉపాధ్యాయ విద్యలో సంస్కరణలపై సోమవారం ముంబై లో రెండో జాతీయ సమావేశం జరిగింది. ఇందులో కొత్తగా ర్యాంకింగ్, అక్రెడిటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయిం చింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లోని సదుపా యాలు, విద్యా ప్రమాణాలను బట్టి ఈ ర్యాకింగ్‌లు ఇస్తారు. ఇందుకోసం అన్ని ఉపా ధ్యాయ విద్యా కాలేజీలు తమ వార్షిక పని తీరు డాటాను అందజేయాలని స్పష్టం చేసిం ది. వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు కేటగిరీల్లో: ప్రతి విద్యాసంస్థకు 4 కేటగిరీల్లోని అంశాలను 100 పాయింట్లుగా పరిగణనలోకి తీసుకొని ఎ,బి,సి,డిలుగా ర్యాంకింగ్ ఇస్తారు. అందులో ఫిజికల్ అసెట్స్ కు గరిష్టంగా 10పాయింట్లు, అకడమిక్ అ సెట్స్‌కు 20 పాయింట్లు, అధ్యాపకులు, అభ్యాసనా నైపుణ్యాలకు 30, 40 పాయింట్లు అభ్యాసన ఫలితాలకు లెక్కించి ర్యాంకులి స్తారు. సి ర్యాంకు వస్తే తమ ప్రమాణాలను 12 నెలల్లో పెంచుకునే సమయం ఇస్తారు. డి–ర్యాంకు వచ్చిన విద్యా సంస్థలను వెంటనే మూసివేయాల్సి ఉంటుంది. -
రెండేళ్ల కోర్సుతో కళాశాలలు మూతపడుతున్నాయి
► వర్సిటీలు ఉన్నత విద్యా మండలి దృష్టికి సమస్య తీసుకువెళ్లాలి ► ఇన్చార్జి వీసీకి బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్ల వినతి ఎచ్చెర్ల క్యాంపస్ : జిల్లాలోని 17 బీఈడీ కళాశాలల ప్రధానాచార్యులు, కార్యదర్శులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిపాలన కార్యాలయంలో ఇన్చార్జి వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్యతో బుధవారం భేటీ అయ్యారు. ఈ మేరకు తమ సమస్యలు వివరించారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భవిష్యత్తులో బీఈడీ కళాశాలలు మూసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత బీఈడీ కళాశాలల పరిస్థితిపై సమీక్షించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి ( ఎస్సీ టీఈ) సంస్థ 2015-16 విద్యా సంవత్సం నుంచి రెండేళ్లు బీఈడీ కోర్సు పరిమితిగా మార్పు చేసిందని, ఏడాది నుంచి రెండేళ్లు కోర్సు చేయటం వల్ల ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపాయని తెలిపారు. 90 శాతం ప్రవేశాలు జరిగే బీఈడీలో ప్రస్తుతం 20 శాతం జరుగుతున్నాయని, మరో పక్క కన్వీనర్ కోటాల్లో సీట్లుకే ప్రవేశాలు పరిమితం అవుతున్నాయని, మేనేజ్మెంట్ కోటాలో కనీసం ప్రవేశాలు జరగటం లేదని వివరించారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బయోమెట్రిక్ హాజరు పక్కాగా అమలు చేస్తే ప్రవేశాలు 10 శాతం సైతం జరగవని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి, నేషనల్ కౌన్సెల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల మేరకు కళాశాలలు నిర్వహిస్తే నష్టాల్లో కళాశాలల నిర్వహణ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేవారు. వర్సిటీ ద్వారా ఉన్నత విద్యా మండలికి సమస్యలు తెలియజేయాలని, ఉన్నత విద్యా మండలి బీఈడీ కళాశాలల పరిస్థితి జాతీయ ఉపాధ్యాయ మండలి దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. సమస్యలు వివరించిన వారిలో బీఆర్‌ఏయూ పాలక మండలి సభ్యులు బరాటం లక్షణరావు, ప్రిన్సిపాళ్లు అంబటి రంగారావు, బమ్మిడి సన్యాసిరావు, నర్సింహమూర్తి ఉన్నారు. -
బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా ఆర్జేడీ బాలయ్య
విద్యారణ్యపురి: హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ వై.బాలయ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ డైరెక్టర్ జి.కిషన్ గురువారం ఉత్తర్వు లు జారీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ సహదేవుడు తమపై అనుచి తంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ పలుమార్లు కళాశాల విద్యార్థులు ఆందోళనలు, ధర్నాలు చేసిన విషయం విధితమే. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా, ఫిర్యాదు కూడా చేశారు. మంత్రి కడియం శ్రీహరి దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జగన్నాథరెడ్డి ఇటీవల కళాశాల సందర్శించి విచారణ జరిపారు. నివేదికను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు అందజేశారు. ఈమేరకు ఆయ న స్థానంలో ఇన్చార్జిగా ఆర్జేడీ బాలయ్యను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సహదేవుడు ప్రస్తుతం సెలవులో ఉన్నారు. -
ప్రశాంతంగా కానిస్టేబుల్ రాతపరీక్ష
► కమిషనరేట్ పరిధిలో 58, ► రూరల్‌లో 51 కేంద్రాలు ► హాజరైన 61,039 మంది అభ్యర్థులు వరంగల్ క్రైం : పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం నిర్వహించగా ప్రశాం తంగా కొనసాగింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 58 కేంద్రాలు ఏర్పాటుచేయగా, 37,704 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 35,337 మంది హాజరయ్యూరని కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. అలాగే, రూరల్ పరిధిలోని జనగామ, న ర్సంపేటల్లో 51 సెంటర్లలో నిర్వహించిన రాత పరీక్షకు 27,341మందికి గాను 25,702 మంది హాజరయ్యూరని రూరల్ ఎస్పీ అంబ ర్కిషోర్ ఝా తెలిపారు. గంటరన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంత రం లోపలకు అనుమతించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీ సు నియామక పరీక్షలు కావడంతో పరీక్ష గదుల్లో అభ్యర్థుల ఫొటో తీయడంతో పాటు బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రల సేకరించారు. అలాగే, హాల్‌టికెట్లను స్కాన్ చేశారు. ఇంకా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేయ గా, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ల నుంచి మినీ బ స్సుల ద్వారా వారిని కేంద్రాలకు తరలించా రు. కాగా, కమిషనరేట్ పరిధిలోని పలు కేం ద్రాలను సీపీ సుధీర్‌బాబుతో పాటు అదనపు డీసీపీ యాదయ్య, ఏసీపీలు సురేంద్రనాథ్, మహేందర్, జనార్దన్, వెంకటేశ్వర్రా వు, రవీందర్రావు, ఈశ్వర్రావు పర్యవేక్షిం చారు. అలాగే, రూరల్ పరిధిలోని కేంద్రాల ను ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా పరిశీలించారు. పలు కళాశాలల్లో... కరీమాబాద్ / మామునూరు : వరంగల్ అం డర్ రైల్వేగేట్ తాళ్ల పద్మావతి ఫార్మసీ, బీఈ డీ కళాశాల, ఉర్సుగుట్ట వద్ద ఉన్న జేఎస్ఎం హైస్కూల్‌తో పాటు మామునూరు పోలీసుస్టేషన్ పరిధిలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో కానిస్టేబుల్ ప్రిలి మినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కాగా, పరీక్షా కేంద్రాలను వరంగల్ సీపీ సుధీర్‌బాబు, ఏసీపీలు సురేంద్రనాథ్, మహేంద ర్, సీఐలు వేణు, శ్రీనివాస్, సంతోష్, ఎస్సై లు రాంప్రసాద్, యుగేందర్, ఎస్సై వెంకట్రావు. ట్రెరుునీ ఎస్సై రాణాప్రతాప్, పీసీలు కటకం శ్రీను, స్వామి పరిశీలించారు. హసన్‌పర్తి, కేయూ పరిధిలో.. భీమారం : కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీ క్ష సందర్భంగా హసన్‌పర్తి, కాకతీయ యూ నివర్సిటీ పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీ సులు పలు ఏర్పాట్లు చేశారు. పీఎస్‌లు, బస్టాండ్ల వద్ద సహాయక వాహనాలు ఏర్పాటుచేయడంతో పాటు అభ్యర్థుల కోసం హెల్త్డెస్క్లు ఏర్పాటుచేశారు. సీఐలు ఎస్.ఎం.అలీ, రవికుమార్ పాల్గొన్నారు. -
10 నుంచి ఏపీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్
తిరుపతి: బీఈడీ కళాశాలల్లో ప్రవేశానికి ఏపీ ఎడ్‌సెట్-2015 వెబ్ కౌన్సెలింగ్‌ను 10 నుంచి నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్ కన్వీనర్ టి.కుమారస్వామి మంగళవారం తెలిపారు. ఎస్కేయూ(అనంతపురం), ఎస్వీయూ(తిరుపతి), జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల(కాకినాడ), ఏఎన్‌యూ(గుంటూరు), అంబేద్కర్ యూనివర్సిటీ(శ్రీకాకుళం), ఏయూ ఇంజినీరింగ్ కళాశాల(విశాఖపట్నం)లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం విద్యార్థులు సెంటర్లలో హాజరవ్వాలని ఆయన తెలిపారు. -
పీహెచ్డీ ఉంటేనే బీఈడీ ప్రిన్సిపాల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఈడీ కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా పని చేయాలంటే విద్యావిభాగంలో పీహెచ్డీ అర్హత ఉండాల్సిందే. తాజాగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) విధించిన సరికొత్త నిబంధన ఇది. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు అందాయి. దీంతోపాటు 2015-17 విద్యా సంవత్సరం నుంచే బీఈడీని రెండేళ్ల కోర్సుగా ప్రవేశపెట్టనున్నట్లు ఎన్సీటీఈ ప్రకటించింది. దీనికోసం అన్ని కళాశాలల్లో వసతులు, అధ్యాపక అర్హతలు, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించేందుకు ఎన్సీటీఈ అధికారుల బృందం అక్టోబర్‌లో పర్యటించనుంది. తాజా నిబంధనలతో బీఈడీ కళాశాలల యాజమాన్యాలు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రిన్సిపాల్స్ హడలిపోతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో విద్యా విభాగంలో పీహెచ్డీ చేసిన పట్టభద్రులు వందలోపే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. -
కోరిక తీర్చకుంటే కోసుకుని చస్తా!
రెండు నెలలపాటు యువతి నిర్బంధం బెదిరించి వాంఛ తీర్చుకున్నఇంజినీరింగ్ విద్యార్థి సహకరించిన రౌడీషీటర్ విజయవాడ సిటీ: ‘కోరిక తీర్చకుంటే కోసుకుని చస్తా.. పారిపోతే నీ కుటుంబాన్ని అంతం చేస్తా..’ అంటూ ఓ శాడిస్టు రెండు నెలలపాటు ఓ విద్యార్థినిని నిర్బంధించి తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఎలాగోలా రెండు రోజుల కిందట అతడిబారి నుంచి తప్పించుకున్న ఆమె.. కుటుంబ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోసారి ఆ శాడిస్టు ప్రతాపం చూపుతాడేమోనన్న ఆందోళనతో నగరంలోని పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారిని కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రయించగా.. ఇలాంటి సైకోలకు తగిన శాస్తి చేయాలంటే పోలీసు కేసు పెట్టడమే మంచి దనే సలహా ఇచ్చారు. సంబంధిత పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలంటూ కుటుంబ సభ్యులకు, ఆమెకు ధైర్యం చెప్పి పంపారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ కృష్ణా ప్రాంతంలోని నగర పంచాయతీకి చెందిన ఓ యువతి కానూరులోని బీఈడీ కాలేజీలో చదువుతోంది. దీనికి సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీలో నూజివీడుకు చెందిన ఓ యువకుడు కూడా చదువుతున్నాడు. రోజూ ఇంటికి రాకపోకలు సాగించే క్రమంలో వీరికి బస్టాండ్‌లో పరిచయం ఏర్పడింది. పక్కపక్క కాలేజీల్లోనే చదువుతుండడంతో ఇద్దరూ బస్టాండ్‌లో దిగి ఒకే బస్సులో కాలేజీకి, కాలేజీ నుంచి బస్టాండ్‌కు వెళ్లేవారు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తన కోరిక తీర్చాలంటూ ఆ యువతిని కోరాడు. దీనికి ఆమె నిరాకరించి మాట్లాడడం మానేసింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత క్షమాపణతో మాటలు కలిపాడు. రెండు నెలల కిందట పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో మంచి మాటలతో మభ్యపెట్టి బిస్కెట్లలో మత్తు కలిపి ఇచ్చాడు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను నేరుగా నూజివీడులోని తన ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించాడు. అతడి తల్లి మందలించే ప్రయత్నం చేయగా కత్తులతో కోసుకుని బెదిరించాడు. దీంతో కొడుకు మాటకు ఆమె ఎదురుచెప్పలేదు. రెండు నెలలపాటు ఆ యువతిని ఇంట్లోనే బంధించి తన శారీరక వాంఛ తీర్చుకున్నాడు. ఆమె ప్రతిఘటిస్తే చనిపోతానంటూ చేతులు, వంటిపై కోసుకుని బెదిరించేవాడు. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే.. ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె తీవ్ర వ్యధను అనుభవిస్తూ గడిపింది. అక్కడి పరిస్థితి తట్టుకోలేని స్థితిలో రెండు రోజుల కిందట తప్పించుకొని పారిపోయి ఇంటికి వచ్చింది. ఈ సంగతి యువతి కుటుంబసభ్యులకు తెలిసినప్పటికీ అతడికి భయపడి ఎవరికీ చెప్పుకోలేకపోయారని తెలిసింది. యువతి ఇంటికి చేరుకున్నాక పోలీసు శాఖలోని ఓ విభాగంలో పనిచేసే పరిచయస్తుడైన అధికారిని కలిసి జరిగిన విషయాన్ని తెలిపారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు రావడంతోపాటు ఆ శాడిస్టు వల్ల ప్రాణభయం ఏర్పడుతుందనే ఆందోళనను యువతి తాలూకు కుటుంబ సభ్యులు వ్యక్తం చేసినట్టు తెలిసింది. రౌడీషీటర్ సహకారం ఇంజినీరింగ్ విద్యార్థి సైకో చర్యలకు నూజివీడు పట్టణానికి చెందిన ఓ రౌడీషీటర్ అండదండలు ఉన్నట్టు తెలుస్తోంది. యువతి కిడ్నాప్ మొదలు ఇంట్లో నిర్బంధించడం వరకు కావాల్సిన సహాయ సహకారాలు రౌడీషీటర్ అందించినట్టు తెలిసింది. ఇతడి దన్నుతోనే కత్తులు చూపించి ఆమెను బెదిరించడం ద్వారా తన వాంఛను తీర్చుకున్నట్టు కుటుంబ సభ్యులు వాపోయినట్టు పోలీసు అధికారి చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. -
అప్రూవల్ లేకుండా స్క్వాడ్
సాక్షి, ఒంగోలు : ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు అడ్డగోలుగా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని కళాశాలలకు స్క్వాడ్లు, ఎగ్జామినర్ల నియామకంలోనూ అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నెల 8వ తేదీ నుంచి వర్శిటీ పరిధిలో బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రకాశంలో 16, గుంటూరు జిల్లాలో మరో 16 కళాశాలల్లో పరీక్షలు జరుగుతుండగా సుమారు 3,500 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే అత్యధిక మంది ఉండటం గమనార్హం. ఆయా రాష్ట్రాల్లో ఉపాధ్యాయ పోస్టులకు ప్రాక్టికల్ పరీక్షల మార్కులకు వెయిటేజీ ఉండటంతో.. విద్యార్థుల నుంచి సొమ్ములకు ఆశపడుతున్న కొందరు ఎగ్జామినర్లు అక్రమాలకు ప్రోత్సహిస్తున్నట్లు వర్శిటీకి ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదీ.. అక్రమాల తీరు బీఈడీ ప్రయోగ పరీక్షలకు 2011-12 వరకు ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒక పరిశీలకుడు, ఇదేం ‘ప్రయోగం’ ప్రత్యేక స్క్వాడ్ బృందాన్ని నియమించేవారు. అనంతరం 2012-13లో పరీక్షల పరిశీలకుల (అబ్జర్వర్లు) వ్యవస్థను తీసేసి... స్టాఫ్ అప్రూవలైన కొందరు బీఈడీ సిబ్బందిని తనిఖీ బృందాలుగా వేశారు. ఆ మేరకు ప్రస్తుత పరీక్షలకు ప్రకాశంలో ముగ్గురు స్క్వాడ్ సభ్యులు, గుంటూరులో ఇద్దరిని నియమించారు. నియామకమైన సభ్యుల్లో స్టాఫ్‌అప్రూవల్ లేని వారు ఉన్నారని.. బీఈడీ యాజమాన్యాలతో ముందస్తు ఒప్పందాలు కుదిరించుకుని ప్రయోగ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌కు అనుమతిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హత లేకుండా స్క్వాడ్ సభ్యులుగా చెలామణి అయిన వారి తప్పిదాలు, కిందటి పరీక్షలప్పుడు వారి అక్రమాలపై ఆధారాలను సేకరించిన కొందరు ఉపాధ్యాయులు వర్శిటీ ఉన్నతాధికారులకు గురువారం రాతపూర్వక ఫిర్యాదు అందించారు. ప్రకాశం జిల్లాలోని దర్శి కళాశాల అధ్యాపకుడితో చేతులు కలిపిన గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన కళాశాల కరస్పాండెంట్ ఈ స్క్వాడ్ బృందాల నియామకంలో చక్రం తిప్పినట్లు సమాచారం. టీడీపీ కీలక నేత ఆశీస్సులతో సదరు కళాశాల కరస్పాండెంట్ ఏఎన్‌యూ అధికారులను బెదిరింపులకు దిగిన సంద ర్భాలపై వర్శిటీ సిబ్బంది భగ్గుమంటున్నారు. పరీక్షల ఎగ్జామినర్ల నియామకమూ ఇష్టానుసారంగా ఉందని.. గతంలో డీఈడీ పరీక్షల చీఫ్లుగా అక్రమాలకు పాల్పడి చర్యలను గురైన వారిని బీఈడీ ప్రయోగ పరీక్షలకు ఎగ్జామినర్లు నియమించారు. దర్శిలోని ఓ బీఈడీ కళాశాల బయాలజీ అంతర్గత పరిశీలకునిగా గుంటూరు నడిబొడ్డునున్న బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ నియామకమయ్యారు. మిర్యాలగూడలోని కళాశాల ప్రిన్సిపాల్ సైతం స్టాఫ్ అప్రూవల్ జాబితాలో లేకుండానే గుంటూరు పల్నాడు కళాశాలలో ఎగ్జామినర్‌గా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు ప్రయోగపరీక్షలకు హాజరుకాకున్నా.. రికార్డులు ఒకరివి ఒకరు పెట్టుకుని రాసినా.. పాత రికార్డులు సమర్పించినా చూసీ చూడనట్టు వ్యవహరించాలనే ఒప్పందంతో ఒక్కో ఎగ్జామినర్‌కు రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు కళాశాలల యాజమన్యాలు అందిస్తున్నట్లు సమాచారం. గైర్హాజరువుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల ప్రాక్టికల్స్‌ను స్థానికులతో చేయించేందుకు ఒక్కోక్కరి వద్ద రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ఏటా బీఈడీ థియరీ, ప్రయోగపరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నా వర్శిటీ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. -
బీఈడీకి జోష్
శాతవాహన యూనివర్సిటీ : కొంతకాలంగా విద్యార్థులు పెద్దగా శ్రద్ధ చూపని బ్యాచ్‌లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సుకు ఈ ఏడాది డిమాండ్ పెరిగింది. ఈ కోర్సును రెండేళ్లకు పెంచాలని ఇటీవల కేంద్రం నిర్ణయించడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతుందన్న ప్రచారం నేపథ్యంలో సీట్లకు గిరాకీ పెరిగింది. గతేడాది రూ.30 వేలు ఉన్న సైన్స్ సీటు ఇప్పుడు రూ.70 వేలు పలుకుతోంది. ఆర్ట్స్ విభాగంలో బీఈడీ సీటు రూ. లక్షల్లో పలుకుతోంది. కౌన్సెలింగ్ నిర్వహించకముందే మేనేజ్మెంట్ సీట్లపై బేరసారాలు మొదలయ్యాయి. కళాశాలల యాజమాన్యాలు ఇదే అదనుగా భావిస్తూ రేట్లు పెంచుతున్నాయి. జిల్లాలో బీఈడీ సీట్లకు పెరిగిన డిమాండ్‌పై కథనం.. రెండేళ్ల కోర్సుతో.. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకానికి కేవలం డీఈడీ చేసిన అభ్యర్థులే అర్హులనే ప్రతిపాదన వచ్చిన నేపథ్యంలో బీఈడీ కోర్సు ఆదరణ తగ్గింది. బీఈడీ కోర్సు నిర్వహణలో ఆర్థిక భారాన్ని డీఈడీ కోర్సుతో సర్దుకునేందుకు ఒకే ప్రాంగణంలో కళాశాలల యాజమన్యాలు ఈ రెండు కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కాలంలో బీఈడీ కోర్సు రెండేళ్ల ప్రతిపాదన రావడంతో ఇప్పుడు బీఈడీ సీట్లకు రెక్కలొచ్చాయి. రెండింతలు బీఈడీ కళాశాలల్లోని మేనేజ్మెంట్ సీట్ల ధరలు గతం తో పోలిస్తే రెండింతలయ్యాయి. గతంలో మ్యాథ్స్, సై న్స్ సీట్లు దాదాపు రూ.30వేల నుంచి రూ.45 వేల వర కు పలికాయి. ప్రస్తుతం అవే సీట్లు రూ.70 వేలకు చేరా యి. ఆర్ట్స్ సీట్ల ధరలు వింటే మైండ్ బ్లాక్ కావాల్సిందే. కౌన్సెలింగ్ విషయంలో నేటికి స్పష్టత లేకున్నా అభ్యర్థులు మాత్రం ముందుగానే సీట్లను దక్కించుకునే పనిలో పడ్డారు. కరీంనగర్‌లోని అనేక కళాశాలల్లో మహిళలు సీట్లు తీసుకునేందుకు శ్రద్ధ వహించడంతో యాజమాన్యాలు రేట్లు పెంచుతున్నాయి. కౌన్సెలింగ్‌పై సందిగ్ధత బీఈడీ కౌన్సెలింగ్‌పై ఇప్పటికీ అధికారిక ఉత్తర్వులు రాలేదు. గత నెల ప్రవేశాలు జరుగుతాయని భావించి నా, అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కౌన్సెలింగ్ విషయంలో అధికారిక ప్రకటన రాకముందు ఎప్పుడు నిర్వహించేది తేల్చలేమని కేయూ అధికారులు పేర్కొంటున్నారు. 2013-14 విద్యాసంవత్సరం బీఈ డీ పరీక్షలు సెప్టెంబ ర్లో ఉన్నందున అక్టోబర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాలున్నా య ని బీఈడీ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో బీఈడీ కళాశాలల సీట్ల వివరాలు.. జిల్లాలో 19 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 1,940 సీట్లు ఉన్నాయి. ప్రతీ కళాశాలలో 20 శాతం సీట్లను కళాశాల మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకునేందుకు అవకాశం ఉంది. రెండేళ్ల ప్రచారం నేపథ్యం లో కరీంనగర్‌తోపాటు శివారులోని బీఈడీ కళాశాలల్లో అధికంగా సీట్లు అమ్ముడుపోయే అవకాశాలున్నాయి. రంగంలోకి ఇతర రాష్ట్రాల పీఆర్వోలు స్వరాష్ట్రంలో సీటు రేటు అధికంగా ఉంటుందనే విషయాన్ని చెబుతూ ఇతర రాష్ట్రాల బీఈడీ కళాశాలల పీఆ ర్వోలు జిల్లా వాసులను బుట్టలో వేసే పనుల్లో పడ్డారు. మా కళాశాలలో చేరితే రికార్డ్స్ రాయనవసరం లేదని, కళాశాలకు హాజరుకావాల్సి అవసరమే లేదని మభ్యపె డుతున్నారు. పరీక్షల సమయంలో ఆయా ప్రాంతాలలో హాస్టల్ వసతితో కలుపుకుని రూ.50 వేలతో కోర్సు పూర్తి చేయవచ్చని ఆఫర్లు ఇస్తున్నారు. దీంతో జిల్లా కేంద్రంగా లక్షల రూపాయల వ్యాపారం సాగుతోంది. ప్రవేశాల క్రమంలో పీఆర్వోలు చెబుతున్నది ఒకలా ఉంటే.. పరీక్షల సమయంలో మరొకలా ఉండి అభ్యర్థులు ఇబ్బందులు పడ్డ ఘటనలు సైతం ఉన్నాయి. -
బీఈడీ కోర్సుపై బెంగ!
అనర్హులే అధ్యాపకులు - తరగతుల నిర్వహణ మృగ్యం - శిక్షణకు నోచుకోని ఛాత్రోపాధ్యాయులు - వసూళ్లకే యాజమాన్యాలు పరిమితం! శాతవాహన యూనివర్సిటీ: కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా మారింది బీఈడీ(బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యూకేషన్) విద్య పరిస్థితి. ఛాత్రోపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణ అందని స్థితి. యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఈ దుస్థితి. ఈ రెగ్యూలర్ కోర్సు కాస్తా దూరవిద్యా విధానాన్ని తలపిస్తోంది. ప్రవేశం పొందిన సగం మంది ఉద్యోగాలు చేస్తూ, ఏదో ఒక వంకతో డుమ్మా కొడుతున్నారు. తరగతి గదులు వెలవెలబోతున్నాయి. ఇదే అదనుగా కళాశాలల యాజమాన్యాలు సైతం తక్కువ విద్యార్హతలున్న అధ్యాపకులను నియమిస్తూ సొమ్ము ఆదా చేసుకుంటున్నాయి. జిల్లాలో చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉంది. కోర్సు తీరుతెన్నులివీ.. యూనివర్సిటీ ప్రకారం పని దినాల సంఖ్య 200. ఛాత్రోపాధ్యాయుల హాజరు కనీసం 80 శాతం ఉండాలనేది నిబంధన. కమ్యూనిటీ స్టడీస్, కేస్ స్టడీ అండ్ లైఫ్ స్కిల్స్, స్కూల్ స్టడీ అండ్ యాక్షన్ రీసెర్చ్, ఐసీటీ, మెథడ్-1,2 రికార్డులు రాసి కళాశాలలో అప్పగించాలి. వీటితోపాటు మైక్రో టీచింగ్ రికార్డ్స్‌ను ఛాత్రోపాధ్యాయులు రాయాలి. క్షేత్రస్థాయిలో మాక్రో టీచింగ్ కోసం కళాశాల కేటాయించిన ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో ఛాత్రోపాధ్యాయులు బోధన చేయాలి. ఇవన్నీ చేస్తే గాని శిక్షణ పూర్తికాదు. కానీ కొన్ని కళాశాలలు వసూళ్లకు తెరతీస్తూ ఛాత్రోపాధ్యాయులను తరగతులకు హాజరుకాకుండా పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. సెప్టెంబర్‌లో పరీక్షల నేపథ్యంలో వర్సిటీ పరిధిలోని బీఈడీ కళాశాలల్లో ఛాత్రోపాధ్యాయుల నుంచి ఫీజు తీసుకోవాలని కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ఆదేశాలు అందాయి. కళాశాలకు రాని, వచ్చినా రికార్డ్సు రాయలేని వారిపై వీరు ‘ఫిక్స్డ్’ ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కళాశాలకు మొత్తానికే రాకుంటే రూ.10 నుంచి రూ. 20 వేలు, రికార్డులు రాయకుంటే రూ.5 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఫీజు.. బీఈడీ పరీక్ష ఫీజును యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పరీక్ష ఫీజు రూ.1050, ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఫీజు రూ.300, ఆన్లైన్ రుసుము రూ. 30, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ రూ.240, స్టూడెంట్ రిగ్ననైజేషన్ రూ.600, ప్రొసెసింగ్ రుసుము రూ.250, వెల్ఫేర్ ఫీజు రూ. 20, ఇంటర్యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫీజు రూ. 40.. మొత్తంగా రూ.2530 చెల్లించాలి. లేని వసతులకు ఫీజులెందుకు.. రికార్డులెందుకు.. జిల్లాలోని అనేక కళాశాల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు లేవు, ఉన్నా వినియోగంలోకి రావడం లేదని ఛాత్రోపాధ్యాయులే పేర్కొంటున్నారు. మరి కంప్యూటర్ రికార్డ్స్ ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంటర్ యూనివర్సిటీ కింద వసూలు చేసే రూ. 40 సైతం వర్సిటీకి ఎందుకు కట్టాలనే ప్రశ్నా సహేతుకమే. వర్సిటీ పర్యవేక్షణ ఉంటే బోధన సరిగా జరిగేదని ఛాత్రోపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, అన్ని వసతులు కల్పించిన కళాశాలలు, కల్పించని కళాశాలలకు ఒకేలా ఫీజు రీయింబర్స్మెంట్, పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మెరుగైన నిబంధనలు పాటించే యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అధ్యాపకులేరి? జిల్లాలోని 20 బీఈడీ కళాశాలల్లో 2000 మంది ఛాత్రోపాధ్యాయులున్నారు. కళాశాలలో అన్ని మెథడ్స్ బోధించే అధ్యాపకులు దాదాపుగా లేరనే చెప్పాలి. ప్రభుత్వానికి ఏవో పేర్లు చూపి కళాశాల యాజమాన్యాలు గుర్తింపు కాపాడుకుంటున్నాయి. అధ్యాపకులుగా ఎంఈడీ వారే ఉండాలి. కానీ అర్హతల విషయంలో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. కోర్సు ఇంత లోపభూయిష్టంగా ఉండడం వల్లే అనేక మంది బీఈడీ చేసిన వారు ఉపాధి లేకుండా ఉంటున్నారనే అభిప్రాయం ఉంది. -
ఎడ్‌సెట్‌లో మనోడే ఫస్ట్
కర్నూలు(విద్య): బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్-2014లో పాములపాడు మండలం ఇస్కాల గ్రామ విద్యార్థి నందీశ్వర కుమారయ్య ప్రతిభ చాటాడు. సోషల్ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. ఈ విద్యార్థి తండ్రి బత్తిని నాగమల్లప్ప వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి కుమార్తె రాజేశ్వరికి వివాహం కాగా, మొదటి కుమారుడు శివకుమార్ పాములపాడులో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. రెండో కుమార్తె మౌనిక ఇంటర్ పూర్తి చేశారు. రెండో కుమారుడు నందీశ్వర కుమారయ్య ఇస్కాల గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి వరకు చదివి 502 మార్కులు సాధించాడు. ఆ తర్వాత ఆత్మకూరులోని థెరిస్సా జూనియర్ కళాశాలలో హెచ్ఈసీ గ్రూపులో ఇంటర్మీడియట్లో చేరి 888 మార్కులు సాధించాడు. ఆ తర్వాత నంద్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. తాజాగా బీఈడీ చదవాలన్న ఉద్దేశంతో గత నెలలో నిర్వహించిన ఎడ్‌సెట్-2014 పరీక్ష రాశాడు. సోషల్ సబ్జెక్టును ఆప్షన్‌గా తీసుకున్న అతను రాష్ట్రస్థాయిలో 102 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. తనకు చరిత్ర పుస్తకాలు చదవడం ఆసక్తి అని కుమారయ్య తెలిపారు.