ఉపాధ్యాయ విద్య కాలేజీలకు ఎన్‌సీటీఈ ర్యాంకింగ్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఉపా ధ్యాయ విద్యా కాలేజీలకు ర్యాంకులు ఇవ్వా లని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిర్ణయించింది. ముఖ్యంగా బీఎడ్ కాలేజీలతో ముందుగా ఈ విధానం అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఉపాధ్యాయ విద్యలో సంస్కరణలపై సోమవారం ముంబై లో రెండో జాతీయ సమావేశం జరిగింది.
ఇందులో కొత్తగా ర్యాంకింగ్, అక్రెడిటేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను అమల్లోకి తేవాలని నిర్ణయిం చింది. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లోని సదుపా యాలు, విద్యా ప్రమాణాలను బట్టి ఈ ర్యాకింగ్‌లు ఇస్తారు. ఇందుకోసం అన్ని ఉపా ధ్యాయ విద్యా కాలేజీలు తమ వార్షిక పని తీరు డాటాను అందజేయాలని స్పష్టం చేసిం ది. వాటి ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిసింది.
నాలుగు కేటగిరీల్లో: ప్రతి విద్యాసంస్థకు 4 కేటగిరీల్లోని అంశాలను 100 పాయింట్లుగా పరిగణనలోకి తీసుకొని ఎ,బి,సి,డిలుగా ర్యాంకింగ్ ఇస్తారు. అందులో ఫిజికల్ అసెట్స్ కు గరిష్టంగా 10పాయింట్లు, అకడమిక్ అ సెట్స్‌కు 20 పాయింట్లు, అధ్యాపకులు, అభ్యాసనా నైపుణ్యాలకు 30, 40 పాయింట్లు అభ్యాసన ఫలితాలకు లెక్కించి ర్యాంకులి స్తారు. సి ర్యాంకు వస్తే తమ ప్రమాణాలను 12 నెలల్లో పెంచుకునే సమయం ఇస్తారు. డి–ర్యాంకు వచ్చిన విద్యా సంస్థలను వెంటనే మూసివేయాల్సి ఉంటుంది.