ప్రశాంతంగా కానిస్టేబుల్ రాతపరీక్ష
► కమిషనరేట్ పరిధిలో 58,
► రూరల్‌లో 51 కేంద్రాలు
► హాజరైన 61,039 మంది అభ్యర్థులు
వరంగల్ క్రైం : పోలీసు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం నిర్వహించగా ప్రశాం తంగా కొనసాగింది. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 58 కేంద్రాలు ఏర్పాటుచేయగా, 37,704 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 35,337 మంది హాజరయ్యూరని కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. అలాగే, రూరల్ పరిధిలోని జనగామ, న ర్సంపేటల్లో 51 సెంటర్లలో నిర్వహించిన రాత పరీక్షకు 27,341మందికి గాను 25,702 మంది హాజరయ్యూరని రూరల్ ఎస్పీ అంబ ర్‌కిషోర్ ఝా తెలిపారు. గంటరన్నర ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంత రం లోపలకు అనుమతించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి పోలీ సు నియామక పరీక్షలు కావడంతో పరీక్ష గదుల్లో అభ్యర్థుల ఫొటో తీయడంతో పాటు బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రల సేకరించారు. అలాగే, హాల్‌టికెట్లను స్కాన్ చేశారు. ఇంకా అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేయ గా, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్ల నుంచి మినీ బ స్సుల ద్వారా వారిని కేంద్రాలకు తరలించా రు. కాగా, కమిషనరేట్ పరిధిలోని పలు కేం ద్రాలను సీపీ సుధీర్‌బాబుతో పాటు అదనపు డీసీపీ యాదయ్య, ఏసీపీలు సురేంద్రనాథ్, మహేందర్, జనార్దన్, వెంకటేశ్వర్‌రా వు, రవీందర్‌రావు, ఈశ్వర్‌రావు పర్యవేక్షిం చారు. అలాగే, రూరల్ పరిధిలోని కేంద్రాల ను ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా పరిశీలించారు.
పలు కళాశాలల్లో...
కరీమాబాద్ / మామునూరు : వరంగల్ అం డర్ రైల్వేగేట్ తాళ్ల పద్మావతి ఫార్మసీ, బీఈ డీ కళాశాల, ఉర్సుగుట్ట వద్ద ఉన్న జేఎస్‌ఎం హైస్కూల్‌తో పాటు మామునూరు పోలీసుస్టేషన్ పరిధిలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలో కానిస్టేబుల్ ప్రిలి మినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కాగా, పరీక్షా కేంద్రాలను వరంగల్ సీపీ సుధీర్‌బాబు, ఏసీపీలు సురేంద్రనాథ్, మహేంద ర్, సీఐలు వేణు, శ్రీనివాస్, సంతోష్, ఎస్సై లు రాంప్రసాద్, యుగేందర్, ఎస్సై వెంకట్రావు. ట్రెరుునీ ఎస్సై రాణాప్రతాప్, పీసీలు కటకం శ్రీను, స్వామి పరిశీలించారు.
హసన్‌పర్తి, కేయూ పరిధిలో..
భీమారం : కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాతపరీ క్ష సందర్భంగా హసన్‌పర్తి, కాకతీయ యూ నివర్సిటీ పోలీసుస్టేషన్ల పరిధిలో పోలీ సులు పలు ఏర్పాట్లు చేశారు. పీఎస్‌లు, బస్టాండ్ల వద్ద సహాయక వాహనాలు ఏర్పాటుచేయడంతో పాటు అభ్యర్థుల కోసం హెల్త్‌డెస్క్‌లు ఏర్పాటుచేశారు. సీఐలు ఎస్.ఎం.అలీ, రవికుమార్ పాల్గొన్నారు.