
పెళ్లికొడుకును చితకొట్టారు
హన్మకొండ : మరికాసేపట్లో వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సి ఉంది. వధువు-వరుడు కలిసి ఏడు అడుగులు వేయాలి. అయితే మూడు ముళ్లు... వేయకముంటే... పెళ్లికొడుకు పీఠముడులు వేశాడు. పెళ్లికూతురు నచ్చలేదంటూ వరుడు ప్రదీప్ రెడ్డి తాళి కట్టనంటూ మొండికేశాడు. పీటలదాకా వచ్చిన పెళ్లి... ఆగిపోతే తమ బిడ్డ భవిష్యత్ ఏమిటని వధువు తల్లిదండ్రులు ఆందోళన చెందారు.
పెళ్లికొడుకును కాళ్లావేళ్లా పడి బతిమిలాడారు. అయినా ఆ వరుడి మనస్సు కరగలేదు దీంతో చిర్రెత్తుకొచ్చిన వధువు కుటుంబ సభ్యులతో పాటు వరుడిని చితకొట్టారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది. కట్నంగా రూ.18 లక్షలు, 20 తులాల బంగారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి సంబంధం మ్యారేజ్ బ్యూరో ద్వారా కుదిరినట్లు తెలుస్తోంది. వధువు తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. వరుడు ప్రదీప్ రెడ్డిది మెదక్ జిల్లా సిద్ధిపేట, వధువుది వరంగల్ జిల్లా గూడూరు.