Bride groom attacked
-
పెళ్లి మండపంలోనే వధూవరుల ఫైటింగ్.. వీడియో వైరల్!
పెళ్లి మండపంలో వధూవరులు కొత్తగా ప్రయత్నించి నవ్వులు పూయిస్తున్న వీడియోలు ఇటీవలి కాలంలో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. అన్ని పెళ్లిళ్లు అలా నవ్వులు పూయించవు. వధూవరుల్లో ఎవరికైనా పెళ్లి ఇష్టంలేకపోతే.. చిన్న చిన్న వాటికే కసురుకుంటారు. ఎవరైనా ఏదైనా అంటే మీదపడిపోతుంటారు. అలాంటి వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఇక్కడ గొడవకు దిగింది వధూవరులే. వివాహ వేదికపైనే వధూవరులు ఇద్దరు తీవ్రంగా కొట్టుకుంటున్న వీడియో నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. వరుడు కోపంతో తన చేతిని వధువు పైకి తీసుకెళ్లగా.. ఆమె దానిని అడ్డుకుంది. దాంతో ఆగ్రహించిన వధువు.. వరుడుపై సివంగిలా విరుచుకుపడింది. వెనకాల ఉన్నవారు ఆపేందుకు ప్రయత్నించినా వరుడికి చుక్కలు చూపించింది. అయితే.. వారి గొడవకు అసలు కారణాలేంటని తెలియరాలేదు. తేగుస్తి అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కొందరు నెజిటన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. మరికొందరు ఫైట్‌కు గల కారణాలను తెలుసుకనేందుకు ప్రయత్నించారు. పెళ్లి రోజునే గొడవకు దిగారంటే వారి బంధం ఎక్కువ రోజులు నిలవదని ఒకరు రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by British Bengali Banter 🇧🇩🇬🇧 (@thegushti) ఇదీ చదవండి: Viral: 16 ఏళ్ల బాలుడి ముక్కు కొరికేసిన రాజకీయ నేత.. అంత కోపం దేనికో? -
పెళ్లి ఊరేగింపుపై పాశవిక దాడి
జైపూర్ : రాజస్ధాన్‌లో ఓ దళిత పోలీస్ పెళ్లి ఊరేగింపుపై అగ్రవర్ణాలు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుగార్ గ్రామంలోకి శనివారం తన పెళ్లి ఊరేగింపు ప్రవేశించిన సమయంలో కొందరు రాజ్పుట్ వర్గీయులు తమపై దాడిచేశారని వరుడు సవాయి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారు పదునైన ఆయుధాలతో దాడికి తెగబడటంతో పలువురికి గాయాలయ్యాయని బాధితుడు తెలిపారు. కాగా, కులదురహంకారంతోనే ఈ దాడి జరిగిందని దళిత సంఘాలు ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశాయి. కాగా బాధితుడి స్టేట్మెంట్ను నమోదు చేశామని, కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీస్ ఇన్స్పెక్టర్ అజిత్ సింగ్ తెలిపారు. గతంలోనూ దళితుల పెళ్లి ఊరేగింపులు తమ వీధుల నుంచి వెళ్లరాదంటూ పలు చోట్ల దాడులు జరిగాయి. -
పెళ్లే వద్దన్నాడు... ఘనంగా 'పెళ్లి' చేశారు
-
పెళ్లికొడుకును చితకొట్టారు
హన్మకొండ : మరికాసేపట్లో వధువు మెడలో మూడు ముళ్లు వేయాల్సి ఉంది. వధువు-వరుడు కలిసి ఏడు అడుగులు వేయాలి. అయితే మూడు ముళ్లు... వేయకముంటే... పెళ్లికొడుకు పీఠముడులు వేశాడు. పెళ్లికూతురు నచ్చలేదంటూ వరుడు ప్రదీప్ రెడ్డి తాళి కట్టనంటూ మొండికేశాడు. పీటలదాకా వచ్చిన పెళ్లి... ఆగిపోతే తమ బిడ్డ భవిష్యత్ ఏమిటని వధువు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పెళ్లికొడుకును కాళ్లావేళ్లా పడి బతిమిలాడారు. అయినా ఆ వరుడి మనస్సు కరగలేదు దీంతో చిర్రెత్తుకొచ్చిన వధువు కుటుంబ సభ్యులతో పాటు వరుడిని చితకొట్టారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకుంది. కట్నంగా రూ.18 లక్షలు, 20 తులాల బంగారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి సంబంధం మ్యారేజ్ బ్యూరో ద్వారా కుదిరినట్లు తెలుస్తోంది. వధువు తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. వరుడు ప్రదీప్ రెడ్డిది మెదక్ జిల్లా సిద్ధిపేట, వధువుది వరంగల్ జిల్లా గూడూరు.