హన్మకొండ అర్బన్ : అర్బన్ జిల్లా కలెక్టర్ నివాస భవనం(క్యాంప్ ఆఫీస్)కు ఆగస్టు 10తో 132 ఏళ్లు పూర్తి చేసుకుని 133లోకి అడుగుపెట్టనుంది. 10- 8- 1886న బ్రిటీష్ అధికారి జార్జ్ పాల్మార్ భార్య ఈ భవన నిర్మాణం కోసం శంకుస్థాపన చేసింది. అనంతర కాలంలో సుభాలపాలన, గవర్నర్‌రూల్, కలెక్టర్ల పాలన కొనసాగాయి. ఉమ్మడి జిల్లా కలెక్టరేట్‌గా ఉన్న పరిపాలనా భవనం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతననిర్మాణం కోసం కూల్చేశారు.
అయితే కలెక్టర్ నివాస భవనం మాత్రం అలాగే ఉంది. నివాస భవనం ఆవరణలో పచ్చిన బైళ్లు, ఈనటికొలను, ఫౌంటేయిన్, పెద్దగడియారం నిషాన్‌గా ఉండేవి. ఉమ్మడి జిల్లాల సమయంలో ఈ భవనంలోకి సామాన్యులకు ప్రవేశం ఉండేది. ప్రస్తుతం కొత్త జిల్లా నేపద్యంలో కలెక్టర్ కార్యాలయం నుంచి పాలనా వ్యవహారాలు సాగిస్తున్నందున భవనం ఆవరణలోకి ఇతరులను అనుమతించడంలేదు.
అదేవిధంగా కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం 13కరాల్లో ఉండగా కార్యాలయం ఆవరనలో ఆ కాలం నాటి పురాతన భావి ఉంది. దీంట్లో 1982లో చేపట్టిన పూడిక తీత పనుల్లో కత్తులు, ఇతర ఆయుధాలు బయటపడ్డాయి. కొద్ది నెలల క్రితం ప్రస్తుత కలెక్టర్ అమ్రపాలి కాట పూడిక తీయించారు. ప్రస్తుతం భావి, కలెక్టర్ నివాస భవనం మాత్రం నిషాన్‌గా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment