సాక్షి,సంగెం(వరంగల్): బాలిక తప్పిపోయినట్లు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, అదే బాలిక వివాహం చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి ప్రభుత్వ పాఠశాలలో అదే గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. కాగా, బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే సదరు బాలిక, అదే గ్రామ శివారు వడ్డెరగూడెంకు చెందిన ఓర్సు కార్తిక్ కొమ్మాల గుడిలో వివాహం చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈవిషయమై ఎస్సై హరితను వివరణ కోరగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా మైనర్ వివాహం చేసుకున్న ఐసీడీఎస్ అధికారులు చోద్యం చూస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
చదవండి: 16 కిలోల బంగారు, అరకిలో వజ్రాలు చోరీ.. అనుమానాస్పద ప్రాంతంలో..
Comments
Please login to add a commentAdd a comment