ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం | 21 Year Girl Goes Missing Unknown Reason Warangal | Sakshi
Sakshi News home page

ఇంటి నుంచి బయటికి వెళ్లిన యువతి అదృశ్యం

Published Sat, Mar 19 2022 12:12 PM | Last Updated on Sat, Mar 19 2022 1:15 PM

21 Year Girl Goes Missing Unknown Reason Warangal - Sakshi

సాక్షి,మడికొండ(వరంగల్‌): కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామానికి చెందిన వస్కుల నివేదిత (21) గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసు స్టేషన్‌లో యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తెలిపారు.

మరో ఘటనలో..

చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
ఖిలా వరంగల్‌: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ చింతల్‌ ప్రాంతానికి చెందిన ఎండి.అహ్మద్‌ పాషా(69) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజు వారీగానే గురువారం ఉదయం లారీ నడిపేందుకు వెళ్లాడు. లారీ పక్కన పెట్టి మధ్యాహ్నం భోజనం చేసేందుకు బైక్‌పై చింతల్‌కు అహ్మద్‌ పాషా బయల్దేరాడు.

ఈక్రమంలో చంద్రవదన కాలనీ రోడ్డు మీదుగా చింతల్‌ సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టి వెళ్లింది. దీంతో అతను రోడ్డు మీద పడగా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం పాషా తుదిశ్వాస విడిచాడు. మృతుడి కుమారుడు ఎండి.జాఫర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ ముస్క శ్రీనివాస్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement