పాక్‌ క్రికెటర్‌ జంషెద్‌ అరెస్ట్‌ | Pakistani cricketer arrested jansed | Sakshi
Sakshi News home page

పాక్‌ క్రికెటర్‌ జంషెద్‌ అరెస్ట్‌

Published Wed, Feb 15 2017 11:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

పాక్‌ క్రికెటర్‌ జంషెద్‌ అరెస్ట్‌

పాక్‌ క్రికెటర్‌ జంషెద్‌ అరెస్ట్‌

ఫిక్సింగ్‌ ఆరోపణలతో లండన్‌లో అరెస్ట్‌ అయిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు పాక్‌ క్రికెటర్‌ నాసిర్‌ జంషెద్‌గా తేలింది. దుబాయ్‌లో జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో జంషెద్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ నిర్ధారించింది. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించినా... వారి పేర్లను ముందుగా వెల్లడించలేదు.

పోలీసులు అదుపులోకి తీసుకోక ముందే పాక్‌ క్రికెట్‌ బోర్డు జంషెద్‌పై అనుమానంతో అతడిపై నిషేధం విధించింది. గత ఏడాది పీఎస్‌ఎల్‌ బరిలోకి దిగిన జంషెద్‌ ఈ సీజన్‌లో టోర్నీలో ఆడటం లేదు. పాక్‌ తరఫున 2 టెస్టులు, 48 వన్డేలు, 18 టి20 మ్యాచ్‌లు ఆడిన 27 ఏళ్ల జంషెద్‌... తన కెరీర్‌లో మూడు అంతర్జాతీయ సెంచరీలను భారత్‌పైనే వన్డేల్లో సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement