ముంబై: గత ఏడాది ఐపీఎల్‌లో ఫిక్సింగ్ జరిగినట్లుగా ప్రచారంలో ఉన్న చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌కు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు సమాచారం. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై విచారణ జరుపుతున్న ముద్గల్ కమిటీకి సౌరవ్ సహకరిస్తున్నాడు. ఆ మ్యాచ్‌కు సంబంధించి సౌరవ్‌ను కమిటీ స్పష్టమైన అభిప్రాయం కోరగా... ఇందులో అనుమానించాల్సిందేమీ లేదని దాదా చెప్పాడు.