
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు మహిళల క్రికెట్‌కి సంబంధించి ఓ గుడ్ న్యూస్ వెలువడింది. పురుషుల ఐపీఎల్ తరహాలోనే వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో కూడిన మహిళా ఐపీఎల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఇవాళ (మార్చి 25) ప్రకటించారు. ముంబైలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా మహిళల ఐపీఎల్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చదవండి: ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ కర్ణ్ శర్మ.. ఎందుకంటే..?
Comments
Please login to add a commentAdd a comment