Women IPL
-
మహిళల ఐపీఎల్ వేలం ఎప్పుడు, ఎక్కడ అంటే..?
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు సంబంధించిన క్రికెటర్ల మినీ వేలం వచ్చే నెల 15న బెంగళూరులో నిర్వహించనున్నారు. వచ్చే సీజన్ ఫిబ్రవరి–మార్చి నెలలో జరుగుతుంది. ఐదు ఫ్రాంచైజీల మొత్తం బడ్జెట్ రూ. 15 కోట్లు. గత సీజన్ రూ. 13.5 కోట్ల కంటే కొంచెం పెరిగింది. ఒక్కో ఫ్రాంచైజీ వద్ద తక్కువ మొత్తమే ఉన్నప్పటికీ పలువురు స్టార్ క్రికెటర్లు వేలానికి రానున్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ హిథెర్ నైట్, న్యూజిలాండ్ పేసర్ లీ తహుహు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ తదితర టాప్ స్టార్లు వేలంలో ఉన్నారు. వీరితో పాటు భారత్‌కు చెందిన స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తిలు కూడా వేలంలోకి వచ్చారు. గత రెండు సీజన్లు (2023, 2024)గా రన్నరప్‌తో సరిపెట్టుకుంటున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ చేతిలో అందరికంటే కనిష్టంగా రూ.2.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. గుజరాత్ జెయింట్స్ చేతిలో గరిష్టంగా రూ. 4.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వద్ద రూ. 3.25 కోట్లున్నాయి. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీలకు సంబంధించిన గడువు ఈ నెలలో ముగియగా... ఒక్క డ్యానీ వ్యాట్ (ఇంగ్లండ్) బదిలీ జరిగింది. యూపీ వారియర్స్ నుంచి ఆర్సీబీ ఆమెను కొనుక్కుంది. -
మహిళల ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అంటే..?
మహిళల ఐపీఎల్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు వచ్చింది. మహిళల ఐపీఎల్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఇవాళ (అక్టోబర్ 18) అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ 91వ సాధారణ వార్షిక సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో మహిళల క్రికెట్‌కు క్రమేపీ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కామన్వెల్త్ క్రీడల దగ్గర నుండి తాజాగా ముగిసిన ఆసియా కప్ వరకు మహిళల క్రికెట్ మ్యాచ్‌లకు ఊహించని టీఆర్పీ వచ్చింది. మ్యాచ్‌లు చూసేందుకు జనాలు స్టేడియంలకు ఎగబడ్డారు. దీంతో ఈ ఊపును క్యాష్ చేసుకోవాలని భావించిన బీసీసీఐ వుమెన్స్ ఐపీఎల్‌కు పచ్చజెండా ఊపింది. చాలాకాలంగా ప్రచారంలో ఉన్న విధంగా మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తొలి ఎడిషన్‌ను ఐదు జట్లతో స్టార్ట్ చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీగ్ ప్రారంభ తేదీ తదితర వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా, భారత్‌లో మహిళల క్రికెట్‌కు సంబంధించి టీ20 ఛాలెంజ్ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. 2018లో ప్రారంభమైన ఈ టోర్నీలో మూడు జట్లు (వెలాసిటీ, ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్) పాల్గొంటున్నాయి. -
రిటైర్మెంట్ ప్రకటనపై యూ టర్న్ తీసుకోనున్న మిథాలీ రాజ్..?
Mithali Raj: భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్ ఇటీవలే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన రిటైర్మెంట్ ప్రకటనపై వెనక్కు తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఐసీసీ హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ పోడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ.. మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ సూచనప్రాయంగా వెల్లడించింది. వచ్చే ఏడాది గనుక మహిళల ఐపీఎల్ ప్రారంభమైతే తప్పక తాను బరిలో ఉంటానని పరోక్షంగా పేర్కొంది. Mithali Raj said, "It would be lovely to be part of the women's IPL. I'm open to coming out of retirement." (To ICC). — Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2022 ఐపీఎల్ కోసం ఆ ఆప్షన్‌ను (రీఎంట్రీ) ఎప్పుడూ ఓపెన్‌గా పెట్టుకుంటానని తెలిపింది. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా అని ఎదురైన ప్రశ్నకు మిథాలీ పైవిధంగా స్పందించింది. కాగా, మహిళల ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ గత కొద్ది కాలంగా భారీ కసరత్తు చేస్తుంది. వుమెన్స్ ఐపీఎల్‌ను ఎలాగైనా వచ్చే ఏడాది (2023) ప్రారంభిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా కొద్దిరోజుల కిందట ప్రకటన కూడా చేశారు. మొత్తం 6 జట్లతో మహిళల ఐపీఎల్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI 2nd ODI: నిరాశకు లోనయ్యాను.. ద్రవిడ్ సర్ చాలా టెన్షన్ పడ్డారు! -
ఆరు జట్లతో మహిళల ఐపీఎల్.. ఎప్పటి నుంచి అంటే..?
మహిళల క్రికెట్‌కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. విశ్వవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వుమెన్స్ ఐపీఎల్‌కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. పురుషుల ఐపీఎల్ తరహాలోనే వచ్చే ఏడాది (2023) నుంచి ఆరు జట్లతో కూడిన మహిళా ఐపీఎల్ నిర్వహించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. తాజాగా జరిగిన మహిళ వన్డే వరల్డ్ కప్ ఊహలకతీతంగా సక్సస్ కావడంతో మహిళల ఐపీఎల్‌కు పావులు చకచకా కదులుతున్నాయి. తాజాగా జరిగిన బీసీసీఐ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో వుమెన్స్ ఐపీఎల్ గురించి చర్చించిన అధికారులు, వచ్చే ఏడాది వేసవిలో ఆరు జట్లతో లీగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లీగ్‌కు సంబంధించి పూర్తి సమాచారం అతి త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. కాగా, ఐపీఎల్ తర్వాత ప్రారంభమైన బిగ్ బాష్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌ల్లో ఇదివరకే మహిళల టోర్నీలు మొదలయ్యాయి. ఈ టోర్నీలకు పురుషుల టోర్నీలతో సమానంగా ఆదరణ లభిస్తుంది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ వంటి భారత ప్లేయర్లు బీబీఎల్‌లో పాల్గొని సత్తా చాటారు. చదవండి: 'బంగారు' వేదాంత్.. డానిష్ ఓపెన్‌లో రెండో పతకం సాధించిన మాధవన్ కొడుకు -
మహిళల ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. వచ్చే ఏడాది నుంచే షురూ..!
ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు మహిళల క్రికెట్‌కి సంబంధించి ఓ గుడ్ న్యూస్ వెలువడింది. పురుషుల ఐపీఎల్ తరహాలోనే వచ్చే ఏడాది నుంచి ఆరు జట్లతో కూడిన మహిళా ఐపీఎల్ నిర్వహించనున్నట్లు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఇవాళ (మార్చి 25) ప్రకటించారు. ముంబైలో జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొద్దికాలంగా మహిళల ఐపీఎల్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: ఐపీఎల్ మోస్ట్ లక్కీ ప్లేయర్ కర్ణ్ శర్మ.. ఎందుకంటే..?