
పంచ్‌కులా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌ను తెలుగు టైటాన్స్ జట్టు ‘టై’తో ముగించింది. యు ముంబా, తెలుగు టైటాన్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ 45–45 వద్ద ‘టై’ అయింది. కెప్టెన్ పవన్ సెహ్రావత్ 14 పాయింట్లు స్కోరు చేసి టైటాన్స్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు.
నిర్ణీత 22 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తెలుగు టైటాన్స్ 19 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ను ‘టై’ చేసుకొని, రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 21 పాయింట్లతో చివరిదైన 12వ స్థానంతో సరిపెట్టుకుంది. తొమ్మిదో సీజన్‌లోనూ టైటాన్స్ చివరి స్థానంలోనే నిలిచింది. నేడు జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో యూపీ యోధాస్; హరియాణా స్టీలర్స్‌తో బెంగళూరు బుల్స్ ఆడతాయి.
Comments
Please login to add a commentAdd a comment