కడితే ‘టై’... కుడితే ఆభరణం... | a special story to tie ... | Sakshi
Sakshi News home page

కడితే ‘టై’... కుడితే ఆభరణం...

Mar 17 2016 10:50 PM | Updated on Sep 3 2017 7:59 PM

కడితే ‘టై’...  కుడితే ఆభరణం...

కడితే ‘టై’... కుడితే ఆభరణం...

మగవారే కాదు మగువలూ కార్పోరేట్ డ్రెస్సుల మీదకు ‘టై’ని ఉపయోగిస్తుంటారు.

న్యూలుక్
 
మగవారే కాదు మగువలూ కార్పోరేట్ డ్రెస్సుల మీదకు ‘టై’ని ఉపయోగిస్తుంటారు. కొన్ని టైలు నప్పక, మరికొన్ని చాలా రోజులు ఉపయోగించి, ఇంకొన్ని మధ్యలో కుట్లు ఊడిపోయి.. ఇలా రకరకాల కారణాలతో ఖరీదైన టైలను ఓ పక్కన పడేస్తుంటారు. ఉపయోగంలో లేని ‘టై’లను మరింత అకర్షణీయంగా ఎలా మార్చుకోవచ్చో ఈ రోజు తెలుసుకుందాం... టై ముందు భాగాన్ని కుచ్చులు పెట్టి, పైన లేస్‌తో పువ్వుల్లా చేసి బటన్ పెట్టి కుట్టాలి. ఇది మరో అందమైన నెక్ డిజైన్‌గా అమరిపోతుంది.
 
చేతి గడియారానికి టై ని బెల్ట్‌లా వాడితే.. అందరి చూపు మీ  మణికట్టు మీదే! సింపుల్ అండ్ క్లాస్‌గా అనిపించే నెక్ డిజైన్‌గా మారిన టై. ప్లెయిన్ టీ షర్ట్‌కి ‘నెక్’ భాగంలో టైని ఇలా ఓ వైపు కుచ్చులు పెట్టి, దాని మీదుగా ముత్యాల హారం కూడా జత చేస్తే పార్టీవేర్‌గా మారిపోతుంది. కలర్‌ఫుల్ టై ఫోన్ పౌచ్‌గానూ, మినీ పర్స్‌గానూ.. అరచేతికి అందమైన అలంకరణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement