చివరి ఓవర్లో విజయానికి భారత్‌కు 7 పరుగులు కావాలి. జడేజా క్రీజ్‌లో ఉన్నాడు. నాలుగు బంతుల తర్వాత స్కోర్లు సమమయ్యాయి. మరో రెండు బంతుల్లో సింగిల్ తీయాల్సి ఉండగా జడేజా బంతిని గాల్లోకి లేపాడు. అంతే... ఆ క్యాచ్‌తో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. పసికూనలాంటి జట్టే అయినా అఫ్గానిస్తాన్ అసమాన పోరాట పటిమ కనబర్చగా... ఐదుగురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన భారత్ ఈ మ్యాచ్‌లో ఓటమికి చేరువగా వచ్చి చివరకు బయటపడింది. అయితే నిజాయితీగా చెప్పాలంటే మన జట్టు గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకోగా... ఓటమి అంచుల నుంచి ‘టై’ వరకు తీసుకు వచ్చిన అఫ్గాన్ సగర్వంగా ఆసియా కప్ నుంచి తిరుగు ముఖం పట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. షహజాద్ (116 బంతుల్లో 124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్భుత సెంచరీతో చెలరేగగా, మొహమ్మద్ నబీ (56 బంతుల్లో 64; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66 బంతుల్లో 60; 5 ఫోర్లు, 1 సిక్స్), అంబటి రాయుడు (49 బంతుల్లో 57; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు.
భారత్- అఫ్గానిస్తాన్ మ్యాచ్ టై
Published Wed, Sep 26 2018 8:06 AM | Last Updated on Thu, Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement