
పోలీస్ పవర్!
దాదాపు 140 నిమిషాల పాటు సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘టై’. శ్రీకాంత్ హీరోగా అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ మస్తాన్ నిర్మించిన ఈ చిత్రానికి సతీష్ కాసెట్టి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ‘‘ఇంతకు ముందు కూడా పోలీస్ పాత్రల్లో నటించాను. కానీ ఈ సినిమాలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. చాలా పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. నటునిగా నాకు తృప్తినిచ్చిన సినిమా ఇది’’ అని హీరో శ్రీకాంత్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: లక్ష్మీ భూపాల్, కెమెరా: శ్యాం ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: హరి అయినీడి.