కబడ్డీ లీగ్‌లో మరో టై | Pro Kabaddi League, PKL Season 4: Jaipur Pink Panthers tie 28-28 against Bengaluru Bulls in nail biting finish | Sakshi
Sakshi News home page

కబడ్డీ లీగ్‌లో మరో టై

Published Fri, Jul 1 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM

కబడ్డీ లీగ్‌లో మరో టై

కబడ్డీ లీగ్‌లో మరో టై

జైపూర్, బెంగళూరు మ్యాచ్
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌లో మరో మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ ఆద్యంతం పూర్తి ఆధిక్యత ప్రదర్శించిన బెంగళూరు బుల్స్ చివర్లో తడబడింది. అటు కొన్ని సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా కెప్టెన్ జస్వీర్ సింగ్ కీలక పాయింట్‌తో జైపూర్ పింక్ పాంథర్స్‌ను ఓటమి నుంచి గట్టెక్కించాడు. అలాగే చివరి మూడు నిమిషాల్లోనూ నాలుగు పాయింట్లు సాధించడంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్ 28-28తో టై అయ్యింది.

అంతకుముందు తొలి 30 నిమిషాల పాటు బెంగళూరు 23-16తో స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోయింది. మ్యాచ్ ముగిసేందుకు నిమిషం కూడా లేని సమయంలోనూ బుల్స్ 28-26 తేడాతో ముందుంది. అయితే జస్వీర్ సింగ్ ఒక పాయింట్‌తో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లు రోహిత్‌ను టాకిల్ చేయడంతో బెంగళూరుకు విజయం దూరమైంది. జస్వీర్ 9, రాజేశ్ నర్వాల్ 4 రైడింగ్ పాయింట్లు సాధించారు. బెంగళూరు నుంచి వినోద్ కుమార్ 5, రోహిత్ 4 పాయింట్లు సాధించారు.
 
ఐస్ దివాస్ బోణీ
మహిళల కబడ్డీ చాలెంజ్‌లో ఐస్ దివాస్ జట్టు తొలి విజయాన్ని సాధించింది. గురువారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో స్టార్మ్ క్వీన్‌ను 28-15తేడాతో ఓడించింది.
 
ప్రొ కబడ్డీ లీగ్‌లో నేడు
యు ముంబా X దబాంగ్ ఢిల్లీ కేసీ
రాత్రి 8 గంటల నుంచి
జైపూర్ పింక్ పాంథర్స్ X బెంగాల్ వారియర్స్
రాత్రి 9 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్2లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement