puneri pultan
-
PKL 2024: తీరు మార్చుకోని తెలుగు టైటాన్స్.. మరో ఘోర ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ 15వ పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం పట్నాలో పుణేరి పల్టన్‌తో జరిగిన పోరులో పవన్ సెహ్రావత్ నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ 29–60 తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పుణేరి ఆల్‌రౌండ్ దెబ్బకు టైటాన్స్ జట్టు నాలుగుసార్లు ఆలౌటైంది. పల్టన్ తరఫున ఆకాశ్ 11 పాయింట్లతో రాణించాడు. టైటాన్స్ ప్లేయర్ సంజీవి అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (17 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు) టైటాన్స్ చివరి స్థానంలో ఉండగా.. పుణేరి పల్టన్ 16 మ్యాచ్‌ల్లో 12 విజయలతో అగ్రస్థానంలో నిలిచింది. -
Pro Kabaddi League: పుణేరి, ముంబా మ్యాచ్ ‘టై’
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో పుణేరి పల్టన్ తొలి ‘టై’ నమోదు చేసింది. యు ముంబా, పుణేరి పల్టన్ జట్ల మధ్య గచ్చి»ౌలి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్ 32–32 పాయింట్లతో ‘టై’గా ముగిసింది. యు ముంబా ప్లేయర్ గుమన్ సింగ్ 15 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ; తెలుగు టైటాన్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
PKL 2023-24: పుణేరీ పల్టన్‌కు షాక్
జైపూర్: సొంతగడ్డపై జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా రెండో విజయంతో సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 36–34 స్కోరుతో పుణేరీ పల్టన్‌ను ఓడించింది. జైపూర్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో చెలరేగాడు. పుణేరీ ఆటగాళ్ళలో కెప్టెన్ అస్లామ్ ముస్తఫా 8 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఓడినా పుణేరీ పల్టన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సీజన్లో పల్టన్ 10 విజయాలు సాధించి, కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఈ సీజన్లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. -
Pro Kabaddi League 2023: డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాక్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో గత సీజన్ రన్నరప్ పుణేరి పల్టన్ సంచలనంతో బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణేరి పల్టన్ 37–33 పాయింట్ల తేడాతో గెలిచింది. తద్వారా గత సీజన్ ఫైనల్లో జైపూర్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. పుణేరి పల్టన్ జట్టు తరఫున కెప్టెన్ అస్లమ్ ముస్తఫా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పది పాయింట్లు సాధించాడు. రెయిడర్ మోహిత్ గోయట్ ఎనిమిది పాయింట్లతో... మొహమ్మద్ రెజా ఐదు పాయింట్లతో రాణించారు. జైపూర్ జట్టు తరఫున అర్జున్ దేశ్వాల్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచినా తన జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 32–30తో బెంగళూరు బుల్స్ జట్టును ఓడించింది. బెంగాల్ తరఫున రెయిడర్లు భరత్ (6 పాయింట్లు), నీరజ్ నర్వాల్ (5 పాయింట్లు), విశాల్ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బెంగళూరు జట్టు కెపె్టన్ మణీందర్ సింగ్ 11 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. -
PKL 2022: సెమీస్ చేరిన నాలుగు జట్లు ఇవే.. ఫైనల్ ఎప్పుడంటే!
Pro Kabaddi League 2022- Semi Finals: ప్రొ కబడ్డీ లీగ్-2022లో భాగంగా మంగళవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ యూపీ యోధాస్‌ను ఓడించింది. ట్రై బ్రేక్(36-36) మ్యాచ్‌లో 6-4 తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక మరో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్.. దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. 56- 24 తేడాతో ఢిల్లీని మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. కాగా అంతకుముందు జైపూర్ పింక్ పాంథర్స్, పుణేరి పల్టన్ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం నాటి(డిసెంబరు 15) తొలి సెమీస్ మ్యాచ్‌లో జైపూర్‌తో... బెంగళూరు తలపడనుంది. అదే విధంగా రెండో మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌తో తమిళ్ తలైవాస్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లలో విజేతగా నిలిచిన జట్లు డిసెంబరు 17న టైటిల్ పోరుకు సిద్దంకానున్నాయి. చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్.. Lionel Messi: ఫైనల్లో అర్జెంటీనా.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ! వారెవ్వా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో -
జయహో... యు ముంబా
ముంబై: మొదటి అర్ధభాగంలో పోటీ ఇచ్చిన పుణేరి పల్టన్ తర్వాత చేతులెత్తేయడంతో యు ముంబా విజయాన్ని పట్టేసింది. దీంతో ప్రొ కబడ్డీ ఏడో సీజన్లో రెండు మరాఠా జట్ల పోరులో తొలి విజయం ముంబైని వరించింది. శనివారం ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మాజీ చాంపియన్ యు ముంబా 33–23తో పుణేరి పల్టన్‌పై గెలిచింది. అభిషేక్ సింగ్ 5 రైడ్ పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యు ముంబా సారథి ఫజేల్ అత్రాచలి, రోహిత్, సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్‌లు చెరో 4 పాయింట్లతో రాణించా రు. పుణేరి తరఫున సుర్జీత్ సింగ్ 6 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ గీతం ఆలపించాడు. నెమ్మదిగా మొదలై.. ఆరంభంలో రెండు జట్లు ఆచితూచి ఆడటంతో పాయింట్లు ఎక్కువగా రాలేదు. పుణే తరఫున తొలి కూతకు వెళ్లిన మంజీత్ రిక్తహస్తాలతో తిరిగొచ్చాడు. అనంతరం ముంబై తరఫున కూతకు వెళ్లిన లీ డాంగ్ జీన్‌ను పుణే పట్టేయడం అదే సమయంలో లీ బోనస్ లైన్‌ను దాటడంతో ఇరు జట్లు ఒకేసారి ఖాతా తెరిచాయి. 2–5తో యు ముంబా వెనుకంజలో ఉన్నప్పుడు ఫజేల్ అత్రాచలి మంజీత్‌ను సూపర్ టాకిల్ చేశాడు. ఆ వెంటనే అభిషేక్ ఒక రైడ్ పాయింట్ తీసుకురావడంతో స్కోరు 5–5తో సమమైంది. పుణే తరఫున సుర్జీత్ సింగ్ సూపర్ టాకిల్ చేయడం, ఆ వెంటనే రైడ్‌కు వెళ్లి సురీందర్ సింగ్, సందీప్ నర్వాల్‌లను ఔట్ చేసి పుణేని 9–8తో ఆధిక్యంలోకి తెచ్చాడు. అయితే ఈ దశలో ముంబై చకచకా మూడు పాయింట్లు సాధించి 11–9తో విరామానికి వెళ్లింది. రెండో అర్ధభాగం ఆరంభమైన కాసేపటికే యు ముంబా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 15–10తో దూసుకెళ్లింది. ఇదే అధిక్యాన్ని చివరి వరకు కొనసాగించిన ముంబై జట్టు విజేతగా నిలిచింది. గట్టెక్కిన జైపూర్... మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 27–25తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. చివరి మూడు నిమిషాల్లో తడబడిన బెంగాల్ మూల్యం చెల్లించుకుంది. జైపూర్ డిఫెండర్ సందీప్ ధుల్ (8 టాకిల్ పాయింట్లు)తో బెంగాల్‌ను పట్టేశాడు. రైడర్ దీపక్ హుడా 6 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
పుణేరి పల్టన్ పై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-2 లో భాగంగా పుణేరి పల్టన్ తో జరిగిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 31-18 తేడాతో పుణేరి పల్టన్‌పై గెలిచింది. తొలి అర్ధభాగంలో 16-8 తో ఆధిక్యంలో ఉన్న జైపూర్ ద్వితియార్ధంలో తమ జోరు తగ్గినా గెలుపు అవకాశాలను ఏ దశలోనూ కోల్పోలేదు. ద్వితియార్ధం చివరి నిమిషాల్లో వరుస పాయింట్లు గెలుస్తూ 31-18 తేడాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జైపూర్ ఆటగాడు రాజేష్ నర్వాల్ 6 పాయింట్లు తీసుకొచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గత మ్యాచ్ జోరును పింక్ పాంథర్స్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది. గత మ్యాచ్‌లో 51-21 భారీ తేడాతో దబాంగ్ ఢిల్లీపై గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో అదే భారీ గెలుపు. సీజన్ ఆరంభంలో తడబాటుకు గురైన డిఫెండింగ్ చాంపియన్లు క్రమంగా జోరందుకున్నారు. వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.