
జైపూర్: సొంతగడ్డపై జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా రెండో విజయంతో సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 36–34 స్కోరుతో పుణేరీ పల్టన్‌ను ఓడించింది. జైపూర్ తరఫున కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 16 పాయింట్లతో చెలరేగాడు. పుణేరీ ఆటగాళ్ళలో కెప్టెన్ అస్లామ్ ముస్తఫా 8 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ గెలుపుతో పాంథర్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఓడినా పుణేరీ పల్టన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సీజన్‌లో పల్టన్ 10 విజయాలు సాధించి, కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడింది. ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తూ.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment