పుణేరి పల్టన్ పై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం | jaipur pink panthers beats puneri pultan in pro kabaddi league | Sakshi
Sakshi News home page

పుణేరి పల్టన్ పై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం

Published Tue, Aug 11 2015 9:04 PM | Last Updated on Sun, Sep 3 2017 7:14 AM

పుణేరి పల్టన్ పై  జైపూర్ పింక్ పాంథర్స్ విజయం

పుణేరి పల్టన్ పై జైపూర్ పింక్ పాంథర్స్ విజయం

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్-2 లో భాగంగా పుణేరి పల్టన్ తో జరిగిన మ్యాచ్ లో జైపూర్ పింక్ పాంథర్స్ విజయం సాధించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో 31-18 తేడాతో పుణేరి పల్టన్పై గెలిచింది. తొలి అర్ధభాగంలో 16-8 తో ఆధిక్యంలో ఉన్న జైపూర్ ద్వితియార్ధంలో తమ జోరు తగ్గినా గెలుపు అవకాశాలను ఏ దశలోనూ కోల్పోలేదు. ద్వితియార్ధం చివరి నిమిషాల్లో వరుస పాయింట్లు గెలుస్తూ 31-18 తేడాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జైపూర్ ఆటగాడు రాజేష్ నర్వాల్ 6 పాయింట్లు తీసుకొచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

గత మ్యాచ్ జోరును పింక్ పాంథర్స్ ఈ మ్యాచ్లోనూ కొనసాగించింది. గత మ్యాచ్లో 51-21 భారీ తేడాతో దబాంగ్ ఢిల్లీపై గెలిచిన విషయం తెలిసిందే. ఈ సీజన్ లో అదే భారీ గెలుపు. సీజన్ ఆరంభంలో తడబాటుకు గురైన డిఫెండింగ్ చాంపియన్లు క్రమంగా జోరందుకున్నారు. వరుస విజయాలతో దూసుకు పోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement