Pro Kabaddi League 2023: డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాక్‌ | Pro Kabaddi League 2023: Puneri Paltan Beat Defending Champions Jaipur Pink Panthers | Sakshi
Sakshi News home page

Pro Kabaddi League 2023: డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాక్‌

Published Tue, Dec 5 2023 8:13 AM | Last Updated on Tue, Dec 5 2023 8:16 AM

Pro Kabaddi League 2023: Puneri Paltan Beat Defending Champions Jaipur Pink Panthers - Sakshi

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ పదో సీజన్‌లో గత సీజన్‌ రన్నరప్‌ పుణేరి పల్టన్‌ సంచలనంతో బోణీ కొట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో సోమవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో పుణేరి పల్టన్‌ 37–33 పాయింట్ల తేడాతో గెలిచింది. తద్వారా గత సీజన్‌ ఫైనల్లో జైపూర్‌ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. పుణేరి పల్టన్‌ జట్టు తరఫున కెప్టెన్‌ అస్లమ్‌ ముస్తఫా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పది పాయింట్లు సాధించాడు.

రెయిడర్‌ మోహిత్‌ గోయట్‌ ఎనిమిది పాయింట్లతో... మొహమ్మద్‌ రెజా ఐదు పాయింట్లతో రాణించారు. జైపూర్‌ జట్టు తరఫున అర్జున్‌ దేశ్వాల్‌ 17 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా తన జట్టును గెలిపించలేకపోయాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 32–30తో బెంగళూరు బుల్స్‌ జట్టును ఓడించింది. బెంగాల్‌ తరఫున రెయిడర్లు భరత్‌ (6 పాయింట్లు), నీరజ్‌ నర్వాల్‌ (5 పాయింట్లు), విశాల్‌ (4 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బెంగళూరు జట్టు కెపె్టన్‌ మణీందర్‌ సింగ్‌ 11 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement