
ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో తెలుగు టైటాన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తూ 15వ పరాజయాన్ని చవిచూసింది. మంగళవారం పట్నాలో పుణేరి పల్టన్‌తో జరిగిన పోరులో పవన్ సెహ్రావత్ నాయకత్వంలోని తెలుగు టైటాన్స్ 29–60 తో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పుణేరి ఆల్‌రౌండ్ దెబ్బకు టైటాన్స్ జట్టు నాలుగుసార్లు ఆలౌటైంది. పల్టన్ తరఫున ఆకాశ్ 11 పాయింట్లతో రాణించాడు.
టైటాన్స్ ప్లేయర్ సంజీవి అత్యధికంగా 8 పాయింట్లు సాధించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో (17 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు) టైటాన్స్ చివరి స్థానంలో ఉండగా.. పుణేరి పల్టన్ 16 మ్యాచ్‌ల్లో 12 విజయలతో అగ్రస్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment