PKL 2022 Semi Finals: Tamil Thalaivas And Bengaluru Bulls Reach Semis, Details Inside - Sakshi
Sakshi News home page

PKL 2022 Semi Finals: ఢిల్లీని మట్టికరిపించిన బెంగళూరు.. యూపీకి తమిళ్‌ తలైవాస్‌ చెక్‌

Published Wed, Dec 14 2022 12:02 PM | Last Updated on Wed, Dec 14 2022 3:43 PM

PKL 2022: Tamil Thalaivas And Bengaluru Bulls Reach Semis - Sakshi

సెమీస్‌ చేరిన నాలుగు జట్లు ఇవే(PC: PKL Twitter)

Pro Kabaddi League 2022- Semi Finals: ప్రొ కబడ్డీ లీగ్‌-2022లో భాగంగా మంగళవారం జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ యూపీ యోధాస్‌ను ఓడించింది. ట్రై బ్రేక్‌(36-36) మ్యాచ్‌లో 6-4 తేడాతో విజయం సాధించింది. తద్వారా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. 

ఇక మరో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌.. దబంగ్‌ ఢిల్లీపై గెలుపొందింది. 56- 24 తేడాతో ఢిల్లీని మట్టికరిపించి సెమీస్‌కు చేరుకుంది. కాగా అంతకుముందు జైపూర్‌ పింక్‌​ పాంథర్స్‌, పుణేరి పల్టన్‌ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గురువారం నాటి(డిసెంబరు 15) తొలి సెమీస్‌ మ్యాచ్‌లో జైపూర్‌తో... బెంగళూరు తలపడనుంది. అదే విధంగా రెండో మ్యాచ్‌లో పుణెరి పల్టన్‌తో తమిళ్‌ తలైవాస్‌ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లలో విజేతగా నిలిచిన జట్లు డిసెంబరు 17న టైటిల్‌ పోరుకు సిద్దంకానున్నాయి.

చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌..
Lionel Messi: ఫైనల్లో అర్జెంటీనా.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ! వారెవ్వా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement